శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:12 IST)

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు సృష్టిస్తారు.. తస్మాత్ జాగ్రత్త.. నారా లోకేశ్

nara lokesh
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నుంచి ప్రారంభించనున్న వారాహి నాలుగో విడత విజయ యాత్రకు అధికార వైకాపా నేతలు, శ్రేణులు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి పార్టీ శ్రేణులు పని చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు. 
 
"రేపటి నుంచి ప్రారంభం అయ్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నాను" అని పిలుపునిచ్చారు. 
 
మరోవైపు  వారావి విజయ యాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ప్రకటించారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయనపుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.