బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (11:51 IST)

నారా లోకేష్‌ను అప్పటివరకు ఎవ్వరూ అరెస్ట్ చేయొద్దు..

nara lokesh
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అక్టోబరు 4 వరకు అరెస్టు చేయొద్దని సీఐడీకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు.
 
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఎపిసిఐడి బృందం శనివారం ఢిల్లీకి వెళ్లనుంది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని లోకేష్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు అక్టోబరు 4కు వాయిదా వేసింది.
 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సిఆర్‌పిసిలోని 41ఎ నోటీసు జారీ చేసిన తర్వాతే విచారణ చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది.