1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (14:35 IST)

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా!!!

chandrababu naidu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోమారు వాయిదా వేసింది. అయితే, ఇరు వర్గాల వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పును వెలువరించవచ్చని భావిస్తున్నారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు సుధీర్ఘంగా వాదనలను ఆలకించిన సుప్రీంకోర్టు మరోమారు వాయిదా వేసింది. 
 
వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సార్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీలు వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. 
 
వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే, ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలిపింది. భోజన విరామ తర్వాత ముకుల్ రోహిత్గీ వాదనలను విన్న న్యాయస్థధానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్‌పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.