ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (17:06 IST)

చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయి.. : సుప్రీంకోర్టు

chandrababu
స్కిల్ డెవలప్‍‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అవినీతి సవరణ చట్టంలోని 17ఏ సెక్షన్ వర్తిందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, సోమవారం కోర్టు సమయం ముగియడంతో విచారణనను సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దాన్ని కొట్టి వేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అయితే, ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. దీంతో మంగళవారం కూడా వాదనలు కొనసాగుతాయి. చంద్రబాబు తరపున సీనియర్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. 
 
ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సార్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో మీ క్లయింట్‌కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని జస్టిస్ అనిరుధ్ బోస్ అన్నారు. 
 
దీనికి సమాధానంగా ధర్మాసన పరిశీలన వాస్తవమేనని సార్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందువల్లే ఈ చట్టానికి సవరణలు చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17ఏ ప్రకారం దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేనని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ మంగళవారం వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై తీర్పును వెలువరించనుంది.