సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కట్‌ డ్రాయర్లతో నడిరోడ్డుపై ఊరేగిస్తాం : వైకాపా నేతలకు నారా లోకేశ్ హెచ్చరిక

nara lokesh
వైకాపా నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఒక్కొక్కడిని కట్ డ్రాయర్లతో నడి రోడ్డుపై ఊరేగిస్తామని హెచ్చరించారు. 
 
యువగళం పేరుతో తాను చేపట్టిన పాదయాత్రలోభాగంగా ఆయన టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఘాటుగా స్పందించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తాము సహనంతో ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటున్నామన్నారు. వైకాపా సైకో మూకల్లాగే తాము కూడా తెగిస్తే రాష్ట్రంలో ఒక్క వైకాపా కార్యాలయం ఉండదని ఆయన హెచ్చరించారు. 
 
గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని వైకాపా నేతలు తెగ సంబరపడిపోతున్నారనీ, వారు దాడి చేసి ధ్వంసం చేసింది రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అని విమర్శించారు. అదేసమయంలో తమ పార్టీపై దాడి చేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మాకు పౌరుషం లేదనుకుంటున్నారా.. కట్ డ్రాయర్లతో నడి రోడ్లపై ఊరేగిస్తాం.. గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు.