శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:42 IST)

నాకు ఇద్దరు పిల్లలు.. నిజంగా నేను ఆంటీనే : మంత్రి రోజా

rkroja
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో తనను పదేపదే ఆంటీ, డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ పిలవడంపై ఏపీ మంత్రి ఆర్కే.రోజా స్పందించారు. నారా లోకేశ్‌ను అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... నిజమే, నేను జబర్దస్త్ ఆంటీనే. దానికి అంతకా నవ్వుతూ జబర్దస్త్ అంటీ అని పిలవాలా అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయసుకు నేను అంటీనే. అందులో ఆశ్చర్యం ఏముంది. అని రోజా ప్రశ్నించారు. లోకేశ్ వేసే జోకులకు జనాలు నవ్వడం లేదని, దాంతో తన జోకులకు తానే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. 
 
జగన్మోహన్ రెడ్డిని చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని రోజా విమర్శించారు. లోకేశ్‌ను ఒక పొలిటికల్ జోకర్‌గా ఆమె అభివర్ణించారు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని రోజా అన్నారు.