గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (18:27 IST)

నెల్లూరులో రోడ్లు కాద‌వి, చెరువులే... తుఫాను ఎఫెక్ట్!

తుఫాను ప్ర‌భావంతో భారీ వ‌ర్షాల‌తో నెల్లూరు జిల్లా వ‌ణికిపోతోంది. ప‌ట్ట‌ణంలో రోడ్ల‌న్నీ జ‌లాశ‌యాల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఆగ్నేయ  బంగాళా  ఖాతంలో ఉత్తర నైరుతి దిశగా  కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం తమిళనాడు దక్షణ కోస్తా లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడకు సమీపంలో తీరానికి దగ్గర‌వుతోంది. దీనికి అనుబంధంగా  వ్యాపించినన ఉపరిత అవర్తనం పశ్చిమ దిశగా పయనిస్తూ దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ -ఉత్తర తమిళనాడు తీరాన్ని సమీపించనుంది. 
 
 
అరేబియా సముద్రంలో గోవా,  దక్షిణ మహారాష్ట్ర తీరం నుండి  దక్షిణ తమిళ నాడు తీరం వరకూ వ్యాపించిన ఉన్న అల్పపీడన ధ్రోణి,4.5 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తులో కొనసాగుతున్న అనుబంధంగా ఉపరితల ఆవర్తనాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. తీరంలో ఈదురు గాలులు వీస్తున్న వాతావరణం కొనసాగుతోంది. రెండు గంటల వ్యవధి కోసారి  కురుస్తోన్న భారీ వర్షంతో రహదారులు, గ్రామాలు, పట్టణాలు, నెల్లూరు నగరంలోని అంతర్గ రోడ్లు జలమయం అయ్యాయి.
 
 
 పదిరోజులు అల్పపీడన ప్రభావాల కారణంగా వెంటాడుతున్న వర్షం, ఎగు ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతోన్న వరదనీటితో పెన్నానది పరవళ్లు తొక్కుతూ ప్ర‌వాహం పెరుగుతోంది. ఇప్పటికీఏ దాదాపు 50 పైచిలుకు క్యూసెక్కుల నీటిని సోమశిల నుంచి దిగు పెన్నానదికి విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా కురుస్తోన్న వర్షల కారణంగా ప్రవాహ ఉధృతి అధికమౌతోంది. 
 
తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే పరిస్థితిని అంచనా వేస్తోన్న వాతావరణ శాఖ అప్రమత్తతను అనుసరించి అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించనున్నారు. నెల్లూరు నుంచి జొన్నవాడ రహదారిలో పొట్టేపాళెం వద్ద చెరువు కలుజు ఉధృతంగా ప్రవహిస్తోండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాద స్థితి ఉండటంతో ద్విచక్రవాహనాలను అనుమతించడం లేదు. తుఫాను ఉధృతి త‌గ్గే వర‌కు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.