బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (17:34 IST)

శ్రీవారి పాదాల చెంత అవకాశం, నా పూర్వజన్మ సుకృతం: తితిదే ఈవో జవహర్ రెడ్డి- video

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించారు నూతన ఈఓ జవహర్ రెడ్డి. అనంతరం శ్రీవారిని దర్సించుకున్నారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వేదపండితులు నూతన ఈఓను ఆశీర్వదించారు.
 
ఈ సంధర్భంగా ఆలయం వెలుపల జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో పుణ్యఫలం చేస్తే గానీ ఈ భాగ్యం దక్కదన్నారు. చాలా సంవత్సరాలుగా స్వామివారిని ఒక భక్తుడిగా సేవించినట్లు చెప్పారు.
 
శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో విద్యను పూర్తి చేశానని... భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతమున్న పద్ధతులను మరింత పటిష్టం చేస్తానన్నారు. రాబోవు కాలంలో భక్తుల కోసం నూతన సంస్కరణ తీసుకువస్తానని చెప్పిన జవహర్ రెడ్డి..చాలా కాలం నిరీక్షణ తరువాత స్వామివారు ఈ అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు జవహర్ రెడ్డి.