సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (09:56 IST)

ఆర్మీ రిక్రూట్​మెంట్​ కు నోటిఫికేషన్ జారీ

ఇండియన్​ ఆర్మీలో చేరాలనుకునే యువతకు గుడ్​ న్యూస్​. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీకి ప్రకటన విడుదలైంది. మేడ్చల్​ జిల్లా హకీంపేట్​ స్పోర్ట్స్​ స్కూలులో మార్చి 5 నుంచి 24 వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్​ ఆర్మీ రిక్రూట్​మెంట్​ కల్నల్​ ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల వారూ ర్యాలీలో పాల్గొనవచ్చు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.  
 
ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 18 నుంచి అడ్మిట్​ కార్డులు వారి వారి మెయిల్స్​​కు వస్తాయి. వాటిపై ర్యాలీ డేట్​ & టైం, డాక్యుమెంట్స్​ స్క్రీనింగ్​, ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్​, ఫిజికల్​ మెజర్​మెంట్​ టెస్ట్​ వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థులు ర్యాలీకి హాజరు కావాల్సి ఉంటుంది.

ఫిజికల్​ ఫిట్​నెస్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, రాత పరీక్ష,  మెడికల్​ టెస్ట్​ ఇలా నాలుగు దశల్లో రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ కొనసాగుతుంది. అయితే ఈసారి కొవిడ్​–19 దృష్ట్యా ప్రాథమిక మెడికల్​ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ర్యాలీకి అనుమతించనున్నారు.
 
రిలాక్సేషన్
ఎక్స్​ సర్వీస్​మెన్​ కేటగిరీ వారికి ఎత్తులో 2 సెంటీమీటర్లు, చాతిలో  ఒక సెం.మీ, బరువులో రెండు కిలోల మేర రిలాక్సేషన్​ ఉంటుంది. అవుట్​ స్టాండర్డ్​  స్పోర్ట్స్​ పర్సన్​ కేటగిరీ వారికి ఎత్లులో 2, చాతిలో 3 సెం.మీలు, బరువులో 5 కేజీల రిలాక్సేషన్​ ఉంటుంది. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అన్ని అర్హతలు సాధించినప్పటికీ కొన్ని సార్లు సెలెక్ట్​ కాకపోవచ్చు. ఎందుకంటే అంతిమంగా అభ్యర్థి సాధించిన మెరిట్​ ప్రకారం సెలెక్షన్​ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి టెస్ట్​లో వీలైనన్ని మార్కులు సాధించేలా కసరత్తులు చేయాలి.
 
కామన్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్​
ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్​లో అన్ని విభాగాల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డిసిగ్నేటెడ్​ హాస్పిటల్​ స్పెషలిస్ట్​ సమక్షంలో మెడికల్​ ఫిట్​ టెస్ట్​ నిర్వహిస్తారు. మెడికల్లీ​ ఫిట్​నెస్​ గల అభ్యర్థులకు ర్యాలీ వెన్యూలోనే కామన్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్​ అడ్మిట్​ కార్డు ఇస్తారు.
 
రిక్వైర్డ్​ డాక్యుమెంట్స్​
డాక్యుమెంట్స్​ విషయంలో అభ్యర్థులు కొంత కేర్​ఫుల్​గా ఉండాలి. నోటిఫికేషన్​లో నిర్దేశించిన ప్రకారం అన్ని ఒరిజినల్​ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్​ సెర్టిఫికెట్స్​పై అటెస్టెడ్​ గెజిటెడ్​ సైన్​ చేయించాలి. సైన్​, అటెస్టెడ్​ స్టాంప్​ ఇంగ్లిష్​లోనే ఉండాలి. అభ్యర్థి సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలపై పేరు, తండ్రి పేరు, డేట్​ ఆఫ్​ బర్త్​ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి.
 
ర్యాలీకి తీసుకెళ్లాల్సినవి
క్వాలిటీ పేపర్​పై ప్రింట్​ చేసిన అడ్మిట్​ కార్డు, అటెస్ట్​ చేయని 20 పాస్​పోర్ట్​ సైజ్​ కలర్​ ఫొటోలు, ఎనిమిదో తరగతి/టెన్త్​/ఇంటర్​/డిగ్రీ సంబంధిత ఎడ్యుకేషనల్​ అర్హత ఒరిజినల్​ మెమోస్​/ ప్రొవిజనల్​ సర్టిఫికెట్లు, నేటివిటి, క్యాస్ట్​, రెలిజియన్​, స్కూల్​ క్యారెక్టర్​(బోనఫైడ్​), క్యారెక్టర్​ సర్టిఫికెట్​(సర్పంచ్​ లేదా మున్సిపాలిటీ నుంచి), అన్​ మ్యారిడ్​ సర్టిఫికెట్, నో ఇన్వాల్వ్​మెంట్​ ఇన్​ క్రైమ్​ సర్టిఫికెట్​, అఫిడవిట్​ డిక్లరేషన్​, ఆధార్​, పాన్​ కార్డ్స్​, కోవిడ్​ 19 సర్టిఫికెట్​ తీసుకెళ్లాలి. అఫిడవిట్​, అన్​ మ్యారిడ్​, కొవిడ్​ 19, టాటూ తదితర సర్టిఫికెట్లకు సంబంధించి మోడల్స్​ అపెండెక్స్​ ఏ నుంచి జీ వరకు నోటిఫికేషన్​లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత మోడల్​ను బేస్​ చేసుకొని ఆయా సర్టిఫికెట్లను​  ర్యాలీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
 
ముఖ్య సమాచారం
దరఖాస్తులు: ఆన్​లైన్​లో..
రిజిస్ట్రేషన్స్​: 19 జనవరి 2021
రిజిస్ట్రేషన్స్​కు చివరి తేది: 18  ఫిబ్రవరి 2021
అప్లికేషన్​ ఎడిట్​ ఆప్షన్​: 18 ఫిబ్రవరి 2021 వరకు
అడ్మిట్​ కార్డుల జారీ: ఫిబ్రవరి 18 నుంచి
రిక్రూట్​మెంట్​ ర్యాలీ: మార్చి 5 నుంచి 24 వరకు
ర్యాలీ వేదిక: స్పోర్ట్స్​ స్కూల్​, హకీంపేట్​, మేడ్చల్​ జిల్లా
అర్హులు: తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు
 
హెల్ప్​లైన్​: ఆర్మీ రిక్రూటింగ్​ ఆఫీస్​, సికింద్రాబాద్​, 040–27740059 & 27740205
వెబ్​సైట్​: www.joinindianarmy.nic.in