గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 జులై 2022 (15:33 IST)

పార్టీని నమ్ముకున్నందుకు అప్పుల్లో మునిగిపోయాం: మంత్రి రోజాకు నిరసన

rk roja
ఏపీ మంత్రి రోజాకు నిరసన సెగ తగిలింది. ఆమె సొంత నియోజకవర్గంలో వైసిపిలో పనిచేస్తున్న మాజీ సర్పంచ్ ఆమె ఎదుట నిరసనకు దిగారు.

 
వడమాలపేట మండలం బుట్టిరెడ్డి కండ్రిగలో రహదారుల నిర్మాణం చేపడితే వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకూ క్లియర్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
వైసిపిని నమ్ముకున్నందుకు తాము అప్పులపాలై నట్టేట మునిగామని మాజీ సర్పంచ్ ఆయన భార్య ఇద్దరూ రోజాకు విన్నవించుకున్నారు.