శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:20 IST)

సెలవులతో 4 రోజులు ఆఫీసులు బంద్‌

ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రానున్నాయి. 10వ తేదీ (రెండో శనివారం), 11న (ఆదివారం), 13న (ఉగాది), 14న (అంబేడ్కర్‌ జయంతి) కావడంతో నాలుగు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌ కానున్నాయి.

ఇక 12న(సోమవారం) క్యాజువల్‌ లీవు (సీఎల్‌) పెట్టుకుంటే.. ఐదురోజుల పాటు సెలవులు ఉంటాయి. మరోవైపు.. బ్యాంకులకు కూడా వరుసగా సెలవులు రానున్నాయి.

ఒక్క సోమవారం రోజునే వర్కింగ్‌ డే. ఆ ఐదు రోజుల్లో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వరుస సెలవులతో కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుంది. దీంతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోలేదు.