శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:10 IST)

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పనిప్రదేశాల్లో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు

1. ప్రాథమిక సమచారం:
a. జాతీయ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కార్యనిర్వాహక నిపుణుల బృందం(NEGVAC) సిఫార్సుల మేరకు ఏప్రిల్‌ 1, 2021 నుంచీ 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందవచ్చు.  
 
b. 45 నుంచి 59 ఏళ్ల వయసున్న వాళ్లలో చాలా మంది సంఘటిత రంగాల్లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.(కొన్ని సంస్థల్లో 65 ఏళ్ల పైబడినవాళ్లూ ఉన్నారు ). ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ, తయారీ, సేవా  రంగంలో వారు సేవలందిస్తున్నారు. 
 
c. అందుకే  వంద కంటే ఎక్కువ మంది అర్హులైన ఉద్యోగులు కొవిడ్‌ టీకా వేసుకోవటానికి  ఆసక్తి చూపితే పనిప్రదేశాలు  లేదా కార్యాలయాల్లోనే టీకా వేసే అవకాశముంది. (టీకా వృథాను అరికట్టి, సమర్థంగా డోసులను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు).
 
 కార్యాలయాల్లోనే టీకా వేయటం వల్ల ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటమేగాక, ప్రయాణ సమయం, కరోనా వైరస్‌ సోకే అవకాశం తగ్గుతుంది.
 
2. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి పనిప్రదేశాలు, కార్యాలయాలు గుర్తించటమెలా?
 
a. ఆసక్తి చూపిస్తున్న లేదా అవకాశమున్న సంస్థ యజమానులు, HODలతో పలు చర్చలు అనంతరం జిల్లా మెజిస్ట్రేట్‌ ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌(DTF), మున్సిపల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలోని పట్టణ టాస్క్‌ ఫోర్స్‌(UTF) ఆసక్తి ఉన్న సంస్థలను గుర్తిస్తారు. 
 
b. సంస్థలోని సీనియర్‌ ఉద్యోగిని నోడల్‌ ఆఫీసర్‌గా సంబంధిత సంస్థ యాజమాన్యం నియమిస్తుంది. ఆ ఉద్యోగి జిల్లా వైద్యాధికారులు/ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల(CVC)తో సమన్వయం చేసుకుని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సహకరిస్తారు. 
 
c. టీకా వేసుకునేందుకు అర్హులైన సిబ్బంది పేర్ల నమోదు మొదలు భౌతిక, సమాచార, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను నోడల్‌ ఆఫీసర్‌ చూసుకుంటారు.
 
3. సంస్థల్లో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులు, ఆసక్తి ఉన్నవాళ్లను గుర్తించటమెలా?
 
a. సంస్థ/సంబంధిత కార్యాలయంలో పనిచేస్తూ 45 ఏళ్లు పైబడివారు మాత్రమే టీకా తీసుకునేందుకు అర్హులు. వారి కుటుంబసభ్యులు, ఇతరులకు 'పనిప్రదేశాల్లోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం'లో టీకా వేసేందుకు అనుమతి ఉండదు.
 
b. వ్యాక్సినేషన్‌కు ముందు అర్హులు కచ్చితంగా కొ-విన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలి. టీకా వేయించుకోవాలనుకుంటున్న ఉద్యోగుల పేర్లన్నీ నమోదయ్యేలా నోడల్‌ ఆఫీసర్‌ చూసుకోవాలి. సంబంధిత సంస్థలో పనిచేసేవాళ్లకు అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యమూ అందుబాటులో ఉంది. 
 
4. పనిప్రదేశం/సంస్థ కార్యాలయాన్ని కొ-విన్‌లో వ్యాక్సిన్‌ కేంద్రంగా నమోదు చేసుకునే విధానం.
 
a. జిల్లా, పట్టణ టాస్క్‌ఫోర్స్‌లు గుర్తించిన అన్ని సంస్థల కార్యాలయాలూ.... పనిప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కేంద్రాలుగా కొ-విన్‌ పోర్టల్‌లో నమోదవుతాయి. 
 
b. పనిప్రదేశాల్లోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం పూర్తి పేరును కొ-విన్‌ యాప్‌లో నమోదు చేయాలి. గందరగోళం నివారణకు సంక్షిప్త పేర్లు నమోదు చేయొద్దు
 
c. పనిప్రదేశాల్లో CVC ఏర్పాటు చేసేందుకు కచ్చితంగా మూడు గదులు(అర్హులు వేచిఉండేందుకు, వ్యాక్సినేషన్‌కు, పరిశీలనకు) అందుబాటులో ఉన్నాయో లేదో జిల్లా/పట్టణ టాస్క్‌ ఫోర్స్‌ నిర్ధారించుకోవాలి( annexure 1ని చదవండి). అవి కార్యాలయం నిర్మాణంలో భాగమై ఉండాలి. తాత్కాలిక షామియానా, టెంట్లు వేసి కేంద్రాలు నిర్వహించకూడదు. 
d. తనిఖీలు పూర్తయ్యాక, కొ-విన్‌ పోర్టల్‌లో కొవిడ్‌ కేంద్రం పేరును DIO నమోదు చేస్తారు. 
 
5. ' పనిప్రదేశాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం'ను 'ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం'తో అనుసంధానించటమెలా? 
 
a. ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రతి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం... సమీపంలోని ప్రభుత్వ వైద్య విభాగం పరిధిలోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంతో అనుసంధానిస్తారు. 
 
b. ప్రైవేటు సంస్థ/కార్యాలయాల్లోని ప్రతి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం... సమీపంలోని ప్రైవేటు వైద్య విభాగం పరిధిలోని కొవిడ్‌ కేంద్రంతో అనుసంధానమవుతుంది. 
 
c. అనుసంధానించిన సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలే.... పనిప్రదేశాల్లో CVCలకు వ్యాక్సినేషన్‌ సిబ్బంది నియమించే బాధ్యత నిర్వర్తిస్తాయి. 
 
d. సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు... తమకు అనుసంధానించిన 'పనిప్రదేశాల్లోని CVC'ల్లో వ్యాక్సినేషన్‌ ప్రణాళికను రూపొందిస్తారు. వనరులు, వ్యాక్సిన్‌ ను సమర్థవంతగా వినియోగించుకునేందుకు కనీసం ప్రతి 50 మందికోసారి ప్రణాళికను రూపొందించాలి లేదా సరిచూసుకోవాలి.  
 
e. వ్యాక్సిన్‌ అందించటంతోపాటు  సంబంధిత 'పనిప్రదేశాల్లోని  CVC'ల్లో కొ-విన్‌ పోర్టల్‌లో నమోదు కచ్చితంగా జరిగేలా చూసే  బాధ్యతను  అనుసంధానిత  CVC ఇన్‌ఛార్జ్‌లే  నిర్వహించాలి. 
 
f. 15 రోజులు ముందుగానే వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ను రూపొందిచొచ్చు.  షెడ్యూల్‌లో పేర్కొన్న తేదీలను ముందుగానే  సంస్థ యాజమాన్యానికి చెప్పాలి. దీ
 
ఆయా రోజుల్లో ఎక్కవ మంది ఉద్యోగులు హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చేందుకు వీలౌతుంది.  చాలా పనిప్రదేశాల్లో 15 రోజులు లోపలే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 
 
6. కోల్డ్‌ ఛైన్‌ పాయింట్స్‌తో 'పనిప్రదేశాల్లో CVC అనుసంధానం' 
 
a. వ్యాక్సిన్‌ సరఫరా కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇదివరకే కొన్ని కోల్ట్‌ ఛైన్‌ పాయింట్‌లతో అనుసంధానమయ్యాయి.  అనుసంధానించిన  'పనిప్రదేశాల్లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు'కు అక్కడి నుంచే వ్యాక్సిన్‌ చేరవేసే ప్రక్రియ కొనసాగుతుంది. 
 
7. 'పనిప్రదేశాల్లోని CVCల్లో వైద్య మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామక ప్రక్రియ
 
a. కొన్ని పనిప్రదేశాలు/సంస్థల్లో ఆసుపత్రులు, హెల్త్‌ క్లినిక్స్‌, నర్సింగ్‌ కేంద్రాలు, తదితర రూపాల్లో వైద్య సదుపాయాలు ఉండే అవకాశముంది. వేచి ఉండేందుకు, వ్యాక్సినేషన్‌కు, పరిశీలనకు అవసరమైన  గదులు ఉన్నట్లైతే  వాటిలోనే వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు. (పూర్తి వివరాలకు annexure 1 చదవండి).
 
b. సంస్థకు చెందిన వైద్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బందినీ( వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది) 'పనిప్రదేశంలో CVC'లో వ్యాక్సిన్‌ వేసే బృందంలో సభ్యులుగా నియమించొచ్చు. 
 
c. వీరికి శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యతను...ఈ CVC కేంద్రానికి అనుసంధానమైన ప్రైవేటు/ప్రభుత్వ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం ఇంఛార్జ్‌ తీసుకోవాలి. 
 
d. వీరు కూడా బృందంలోని మిగత సభ్యుల మాదిరిగా నిర్ధిష్ట ప్రామాణిక వ్యాక్సినేషన్‌ విధానాన్ని పాటించాలి. నిర్వహణతోపాటు వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో కనిపించే లక్షణాలను కొ-విన్‌లో నమోదు చేసే విధానాన్ని అనుసరంచాలి.  
 
8. పనిప్రదేశాల్లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో సిబ్బంది నియామకం
 
a. ప్రభుత్వ పనిప్రదేశాలు/కార్యాలయాల్లో జిల్లా వైద్యాధికారులే సహజంగా సిబ్బందిని కేటాయిస్తారు. ప్రైవేటు పనిప్రదేశాలు/ సంస్థలకు ప్రైవేటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలే సిబ్బందిని పంపిస్తాయి.  
 
b. పనిప్రదేశాల్లోని CVCల్లో వంద మందికి టీకా వేసేందుకు పూర్తిగా శిక్షణ పొందిన ఒక బృందాన్ని నియమిస్తారు. వందమందికంటే ఎక్కువ మంది అర్హులుంటే అదనపు బృందాలను కచ్చితంగా కేటాయించాలి. వ్యాక్సినేషన్‌కు సరిపడా గదులు/ఖాళీ( ANNEXURE-1) ఉంటేనే అదనపు బృందాన్ని పంపించొచ్చు.
 
c. పనిప్రదేశం/సంస్థ యాజమాన్యమే వ్యాక్సినేషన్‌కు సరిపడా గదులు/ప్రాంగణం కల్పించాలి.  
 
d. బృంద సభ్యుల వివరాలు
బృంద సారథి(‌కచ్చితంగా వైద్యుడు అయి ఉండాలి)
టీకా వేసే సిబ్బంది(‌ఇంజెక్షన్‌ వేసేందుకు అనుమతి పొంది ఉండాలి)
వ్యాక్సినేషన్‌ అధికారి-1: పరిశీలన, కొ-విన్‌ నమోదు ప్రక్రియ 
వ్యాక్సినేషన్‌ అధికారి-2&3: టీకా వేసిన, వేసుకోబోతున్న వ్యక్తుల నియంత్రణ, పర్యవేక్షణ, AEFI పరిశీలనలు, ఇతర సమాచారం చేరవేయటం(‌ANNEXURE-2)
 
9. AEFI నిర్వహణ: 
 
a. అన్ని 'పనిప్రదేశాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల'కు బృంద సారథి/సూపర్‌వైజర్‌గా వైద్యాధికారి ఉంటారు. 
 
b. అన్ని కేంద్రాల్లోనూ అనాఫిలాక్సిక్‌ కిట్‌ ఉంటుంది.  కొవిడ్‌ టీకా వేసుకున్నవాళ్లలో తీవ్రమైన, అతితీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని ఉపయోగించాలి. వైద్యసాయం/నిర్వహణ అవసరమైనప్పుడు సమీపంలోని AEFI నిర్వహణ కేంద్రం/హెల్త్‌ ఫెసిలిటీ కేంద్రానికి సమాచారమిచ్చి రప్పించొచ్చు. పనిప్రదేశాల్లో CVC నుంచి AEFI నిర్వహణ కేంద్రానికి మధ్య గంటలోపు ప్రయాణించగలిగే దూరం మాత్రమే ఉండాలి. 
 
c. 'పనిప్రదేశాల్లో CVC'ల వద్ద కచ్చితంగా ప్రాణాధార వ్యవస్థ కలిగ ఉన్న అంబులెన్స్‌ను ఉంచాలి. అత్యవసర సమయాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిని తరలించేందుకు దీన్ని ఉపయోగించాలి. 
 
10. పనిప్రదేశాల్లోని కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 
 
a. ఒకరకమైన టీకా మాత్రమే కేటాయించాలి. రెండు రకాలు ఇస్తే వాటిని కలిపేసే లేదా కలబోత జరిగే అవకాశముంది. మొదటి డోసు ఒక టీకా... రెండో డోసులో మరో టీకా వేసే ప్రమాదమూ ఉంది. వీటిని నివారించేందుకు ఒకరకమైన టీకా మాత్రమే సరఫరా చేయాలి. 
 
b. తొలి డోసు ఏ వ్యాక్సిన్‌ వేయించుకున్నారో రెండో డోసూ అదే వ్యాక్సిన్‌ వేసుకోవాలి. తొలి డోసుకీ, రెండో డోసుకీ తేడా ఉందని గుర్తిస్తే ఆ వ్యక్తి టీకా తీసుకోవద్దు. సంబంధిత కేంద్రానికి వెళ్లి తొలి డోసు ఏదైతే వ్యాక్సిన్‌ వేసుకున్నారో అదే వ్యాక్సిన్‌ను వేసుకోవాలి. 
 
c. కొ-విన్‌లో నమోదు చేసిన అర్హుల పేర్లన్నీ వ్యాక్సిన్‌ వేసేవాళ్లకు, తనిఖీలు చేసేవాళ్లందరికీ కనిపించేలా ఉండాలి. అప్పటికప్పుుడు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమూ ఉంది. 
 
1. వ్యాక్సినేషన్‌ అధికారి-1 ఆధార్‌ సంఖ్య ఆధారంగా తనిఖీలు చేస్తారు. 
2. ఏదైనా కారణాల వల్ల ఆధార్‌ ధ్రువీకరణ జరగకపోతే, సంబంధిత వ్యక్తి గుర్తింపు, అర్హతను రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు చూపించిన ఫొటో ఐడీ కార్డు ద్వారా గుర్తించాలి. 
d. ఆధార్‌ గాకుండా 1.ఓటరు కార్డు 2. పాస్‌పోర్టు 3.డ్రైవింగ్‌ లైసెన్స్‌ 4. పాన్‌ కార్డు 5. NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్‌ కార్డు 
 
ఫొటో ఉన్న పింఛను పత్రం మాత్రమే గుర్తింపు  తన
పరిగణలోకి తీసుకోవాలి.
 
e. గుర్తింపు, అర్హత నిర్ధరణ పూర్తయ్యాక మాత్రమే టీకా వేసి కొ-విన్‌లో సమాచారం అప్‌డేట్‌ చేయాలి. లేదంటే వ్యాక్సిన్‌ వేయకూడదు. 
 
f. వ్యాక్సినేషన్‌ జరుగుతుండగానే అదే రోజు ఎప్పటికప్పుడు కొ-విన్‌లో వ్యాక్సినేషన్‌ వివరాలు నమోదు  చేయాలి.
 
g. వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ ధ్రువీకరణ పత్రం కొ-విన్‌ పోర్టల్‌ ద్వారా జనరేట్‌ చేయాలి. రెండు డోసులూ వేశాక పనిప్రదేశాల్లోని CVC నోడల్‌ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత వ్యక్తికి అందజేయాలి. 
 
h. ప్రణాళిక రూపకల్పన, నిర్వహణ కోసం కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మార్గదర్శకాలు, నిర్ధిష్ట ప్రమాణిక విధానాన్ని అనుసరించాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
 https://www.mohfw.gov.in/pdf/COVID19VaccineOG111Chapter16.pdf
https://www.mohfw.gov.in/pdf/GuidancedocCOWIN2.pdf
 
11.  పనిప్రదేశాల్లోని CVCల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పర్యవేక్షణ 
 
a. ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ కేంద్రాల ఇంఛార్జులే... సంబంధిత పనిప్రదేశాల్లోని CVCల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహణ, ప్రక్రియ సన్నద్ధతను సమీక్షించాలి.
 
b. పనిప్రదేశాల్లోని ప్రక్రియ విధానాన్ని CVCల్లో జిల్లా, పట్టణ టాస్క్‌ ఫోర్స్‌లు పర్యవేక్షించాలి. కింది అంశాలు ఆయా కేంద్రాల్లో ఉన్నాయో లేదో చూడాలి.
అర్హుల వివరాలు సరిచూడటం, అర్హులకే టీకా వేస్తున్నారని నిర్ధారించుకోవటం, నిర్ధిష్ట ప్రామాణిక విధానాన్ని పాటిస్తున్నారో లేదో చూడాలి. 
మానవ వనరులు/సిబ్బంది శిక్షణ పొందారా లేదా అన్నది సరిచూసుకోవాలి
AEFI నిర్వహణ
 
12. పనిప్రదేశాల్లోని CVCల్లో వ్యాక్సినేషన్‌ వేసేటప్పుడు అనుసరించాల్సిన ఆర్థిక మార్గదర్శకాలు
 
1. జిల్లా వైద్యాధికారులు నిర్వహిస్తున్న ప్రభుత్వ కొవిడ్‌ కేంద్రాల్లో ఉచితంగా టీకా వేస్తారు. 
 
2. ప్రైవేటు కొవిడ్‌ కేంద్రాల్లో... ప్రైవేటు వైద్య రంగానికి ఇదివరకే నిర్దేశించిన ధరల ప్రకారమే వసులు చేయాలి. 
ఒక వ్యక్తికి ఒక డోసు వేసేందుకు గరిష్ఠంగా రూ.100 మాత్రమే సేవా రుసుము కింద తీసుకోవాలి 
వ్యాక్సిన్‌ విలువ డోసుకు రూ.150 
అన్నీ కలిపి గరిష్ఠంగా ఒక వ్యక్తి నుంచి ఒక డోసుకు రూ.250 మాత్రమే వసులు చేయాలి 
 
3. ప్రైవేటు సెక్టార్‌ పనిప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్న ప్రైవేటు వైద్య సంస్థ... వ్యాక్సిన్‌ రుసుమును జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ(‌National Health Authority) నిర్దేశించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేస్తుంది. జిల్లాకు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న డిస్ట్రిక్ట్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌( DIO)కు డిపాజిట్‌/పేమెంట్‌ వివరాలు చూపించి  వ్యాక్సిన్‌ తీసుకుంటాయి. NHA పోర్టల్‌లోని పేమెంట్‌ గేట్‌వేను ప్రైవేటు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు వినియోగించుకుంటారు.
ANNXURE-1 (అనుబంధం-1)
పనిప్రదేశాల్లోని కొవిడ్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేసేటప్పుడు పాటించాల్సిన ప్రమాణాలు 
 
పనిప్రదేశం లేదా కార్యాలయంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పూర్తిగా హద్దులు ఏర్పరిచిన మూడు గదులు అందుబాటులో ఉండేలా చూడాలి 
 
1.అర్హులు, టీకా వేసుకునేందుకు వచ్చినవాళ్లు వేచి ఉండే గది 2. వ్యాక్సినేషన్ గది 3. పరిశీలన గది(కింది చిత్రంలో చూపించినట్లుగా రెండు ద్వారాలు ప్రవేశం, బయటకి వెళ్లేందుకు వీలుగా ఉండేలా చూసుకోవాలి) 
1.2. పరిశీలన, వేచి ఉండే గదిలో కనీసం 1.82 మీటర్ల భౌతిక దూరం కుర్చీల మధ్య ఉంచాలి. ఒకగది నుంచి ఇంకో గదిలోకి లబ్ధిదారులు ఇష్టమొచ్చినట్లుగా తిరగకుండా  చూసుకోవాలి. తొలుత వేచి ఉండే గదిలోకి, తరువాత వ్యాక్సినేషన్ గదిలోకి... చివరగా పరిశీలన గదిలోకి వెళ్లేలా మాత్రమే సూచనలు ఇవ్వాలి. చేతులు కడుక్కోవటానికి, శానిటైజషన్ కు, IES పరికరాల ప్రదర్శనకు  వీలుగా గదిలో ఏర్పాట్లు ఉండాలి.
 
1.3. వ్యాక్సినేషన్ గది: వ్యాక్సినేషన్ గదిలో 4 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్న టేబుల్ , రెండు కుర్చీలు కచ్చితంగా ఉండాలి. చేతులు శుభ్రపరుచుకోవటానికి/శానిటైజేషన్ తోపాటు పైన సూచించిన ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకునేందుకు వచ్చిన వ్యక్తి మహిళ అయితే గదిలో మహిళా వైద్య సిబ్బంది కచ్చితంగా వ్యాక్సిన్ వేసేటప్పుడు ఉండాలి. ఒకసారి ఒక లబ్ధిదారుడు మాత్రమే వ్యాక్సిన్ వేసుకునేందుకు లోపలికి వెళ్లాలి. 
వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే గదిలో ఈ వసతులు ఉండేలా జిల్లా వ్యాక్సినేషన్ అధికారి చూసుకోవాలి:
 
1. కోల్డ్ ఛైన్ లో సరిపడా వ్యాక్సిన్ ఉంచాలి
2. సిరంజీలు సరిపడా ఉంచాలి 
3. చేతులు శుభ్రపరుచుకునే  శానిటైజర్లు, మాస్కులు 
4. హబ్ కత్తిరించే పరికరం/సూదిని చిదిమేసే పరికరం
5. గోప్యత కోసం స్క్రీన్ లేదా కర్టెయిన్ ఉంచాలి 
6. అనాఫిలాక్సిస్ కిట్
7.చెత్త/వృథా పరికరాలను వేర్వేరుగా వేసేందుకు వీలుగా రంగుల సూచికలతో ఉన్న బ్యాగులు ఉంచాలి 
8. ఖద్దరు వస్త్రం​/కాటన్ వస్త్రం ఉండాలి 
9. IEC పరికరాలు 
1.4. వ్యాక్సిన్ వేశాక టీకా తీసుకున్న వ్యక్తిలో తీవ్ర లక్షణాలు ఉన్నాయో లేదా పరిశీలించేందుకు వీలుగా పరిశీలన గదిలో 30నిమిషాల పాటు ఉంచేలా ఏర్పాట్లు చేయాల
 
దీనికి తగిన స్థలం గదిలో ఉండేలా చూడాలి.  
 Annexure – 2  అనుబంధం-2 
వ్యాక్సినేషన్ సిబ్బంది బాధ్యతలు
DIO- District Immunization Officer(జిల్లా వ్యాక్సినేషన్ అధికారి):
 
1. వ్యాక్సినేషన్ మొత్తం ప్రణాళిక, అది అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత DIOపైనే ఉంటుంది.
2. పనిప్రదేశాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చేటప్పుడు వాటిని చక్కదిద్దాలి
3. వ్యాక్సిన్, ఇతర పరికరాల స్టాకు, పనిప్రదేశాల్లోని కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో సరఫరా చేసిన వ్యాక్సిన్ ను భద్రపరచాలి.
పనిప్రదేశాల్లోని కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో నోడల్ అధికారి బాధ్యతలు:
1. పనిప్రదేశాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వర్తించగల సిబ్బందిని గుర్తించటం, వారి పేర్లను కొ-విన్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడటం
2. తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఇంటర్నెట్ అనుసంధానం, సరిపడా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ప్రింటర్లు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి 
3. వ్యాక్సిన్ వేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు క్యూలో వచ్చేలా చూడాలి. వారి వివరాలు తనిఖీలు, వ్యాక్సినేషన్, పరిశీలనకు యంత్రాంగం ఉండేలా చూసుకోవాలి. 
4. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకునేందుకు వీలుగా గుర్తులు, సూచికలు, చిహ్నాలు ఏర్పాటు చేయాలి 
5.  రెండు డోసులూ తీసుకున్న వ్యక్తికి వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం అందించేలా ఏర్పాట్లు చేయాలి 
 
బృంద సారథి( వైద్యాధికారి) బాధ్యతలు :
1. కొ-విన్ అప్లికేషన్ లో లబ్ధిదారుడు నమోదుచేసుకున్న వివరాలు తనఖీలు చేసే సిబ్బంది ప్రామాణిక విధానం పాటించేలా చూసుకోవాలి
2. వ్యాక్సినేషన్ వేసిన వ్యక్తి నిర్ధిష్ట ప్రామాణిక విధానం పాటిస్తూ వ్యాక్సిన్ వేసేలా, వినియోగించిన తరువాత పడేయాల్సిన పరికరాలను జాగ్రత్తలన్నీ తీసుకునే పడేస్తున్నాడా లేదా అన్నది సరిచూసుకోవాలి 
3. వ్యాక్సినేషన్ సెషన్ లో AEFI కిట్ ఉంచేలా, అవసరమైనప్పుడు AEFI కిట్ సరిగా వాడేలా చూడాలి 
4. అత్యవసర సమయాల్లో లబ్ధిదారున్ని AEFI నిర్వహణ కేంద్రానికి పంపించాల్సి వచ్చినప్పుడు... అక్కడి వరకూ లబ్ధిదారున్ని అంబులెన్స్ లో చేర్చటంతోపాటు, సమస్యను అక్కడి వైద్యులకు వివరించాలి. 
వ్యాక్సిన్ వేసే అధికారి బాధ్యతలు:
సుశిక్షితులైన హెల్త్ కేర్ సిబ్బంది వ్యాక్సిన్ వేస్తారు. వారి విధులు, బాధ్యతలు 'నిర్వహణ మార్గదర్శకాల్లో ' వివరించటం జరిగింది. 
 
తనిఖీలు చేసే అధికారి(వ్యాక్సినేషన్ ఆఫీసర్-1) బాధ్యతలు: 
వ్యాక్సినేషన్ కు  ముందు లబ్ధిదారుని గుర్తింపు వివరాలు తనిఖీలు చేసే బాధ్యత నిర్వర్తించాలి. కొ-విన్ లో వివరాలు నమోదు చేయకుండానే వ్యాక్సినేషన్ కు వచ్చిన వ్యక్తుల వివరాలను అప్పటికప్పుడు నమోదు చేయటంతోపాటు తనిఖీలూ చేయాలి. 

వ్యాక్సినేషన్ అధికారులు-2&3 బాధ్యతలు:
1. పరిశీలన గదిలోనే నిరంతరం ఉండాలి 
2. లబ్ధిదారులు/వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చేవాళ్లు కనీసం 1.82 మీటర్ల భౌతిక దూరం పాటించేలా చూడాలి 
3. ప్రతి లబ్ధిదారుడినీ కనీసం 30 నిమిషాలు పరిశీలించాలి
4. లబ్ధిదారునిలో తీవ్ర, అతితీవ్ర లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వ్యాక్సిన్ వేసే వ్యక్తికి తెలియజేయాలి 
5. AEFI నిర్వహణ/వినియోగంలో వ్యాక్సినేటర్ కు సహకరించాలి
          Annexure – 3 అనుబంధం-3 
టీకా వేశాక శరీరంలో సంభవించే  దుష్ప్రభావాలు అనారోగ్యాల(ఏఈఎఫ్‌ఐ) నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి
వ్యాక్సిన్‌ వేశాక శరీరంలో  అవాంఛిత అనారోగ్య సూచికలు కనిపిస్తుంటాయి. అవన్నీ వ్యాక్సిన్‌ వేయటం వల్లనే వచ్చిన సమస్యలుగా భావించాల్సిన అవసరం లేదు. ఈ దిగువన సూచించిన విధంగా వాటిని గుర్తించి తీవ్రత ఆధారంగా రిపోర్టు చేయాలి. 
 
 AEFI  కేటగిరీలు: 
స్వల్ప  లక్షణాలు: 
టీకా వేసినప్పుడు నొప్పి, వేసిన ప్రాంతంలో వాపు వంటి సమస్యలు సాధారణంగా వస్తాయి. జ్వరం, చికాకు, ఆయాసం వంటి ప్రభావాలు కనిపించినప్పుడు స్వల్ప సమస్యలు కింద భావించి కొ-విన్ లో రిపోర్టు చేయాలి
తీవ్ర లక్షణాలు: 
అనాఫిలాక్సిక్‌ వంటి తీవ్ర రుగ్మతలు వాటంత అవే తగ్గిపోతాయి. 102 డిగ్రీలు దాటిన జ్వరం, హైపోటోనిక్‌ హైపో రెస్పాన్సివ్‌, సెస్పిస్‌ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రి వరకూ వెళ్లాల్సిన అవసరంలేదు. ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం లేదు. కొద్ది రోజుల్లోనే ఈ రుగ్మతలు మాయమైపోతాయి. 
అతి తీవ్ర లక్షణాలు: 
మరణాలు, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు, సమూహంలో ఎక్కవమందిపై ప్రభావం చూపించటం, మీడియాలో వచ్చిన వార్తలు/ఏదైనా సామాజికవర్గం/ఓ ప్రాంతానికి చెందిన వారిలో తలెత్తే ఆందోళనలు అతి తీవ్ర లక్షణాలు/సమస్యలుగా గుర్తించాలి. 
స్వల్ప, తీవ్ర సమస్యల సమాచారాన్ని కొ-విన్‌ యాప్‌ ద్వారా వ్యాక్సినేటర్‌ లేదా కొవిడ్‌ టీకా కేంద్రానికి  చేరవేయాలి.అతి తీవ్ర సమస్యల గురించి వెంటనే జిల్లా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అధికారికి ఫోన్‌ చేసి సమాచారమందించాలి. 
 
ఆ వెంటనే రాతపూర్వకంగానూ  సమాచారం చేరవేయాలి. 
పని ప్రదేశంలోని కొవిడ్‌ కేంద్రం: 
బృందానికి నేతృత్వం వహిస్తున్న వైద్యాధికారి అనాఫిలాక్సిస్‌/ఏఈఎఫ్‌ఐ  నిర్వహణ 
భాధ్యతలు చూసుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఏఈఎఫ్‌ఐ కేంద్రానికి సమాచారమిస్తారు. 
ప్రాణాధార వ్యవస్థ అంబులెన్స్‌: 
పనిప్రదేశంలోని కొవిడ్‌ కేంద్రంలో ప్రాణాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అతితీవ్ర లక్షణాలు తలెత్తినప్పుడు అత్యవసరమైతే వెంటనే అంబులెన్స్‌లో ఏఈఎఫ్‌ఐ మేనేజ్‌మెంట్‌ కేంద్రానికి తరలించాలి. 
అనాఫిలాక్సిస్‌ కిట్‌: 
వ్యాక్సిన్‌ కేంద్రంలో కచ్చితంగా అనాఫిలాక్సిక్‌ కిట్‌ ఉంచాల్సిన బాధ్యత బృందానికి సారథ్యం వహిస్తున్న వైద్యాధికారి/సూపర్‌వైజర్‌దే. కాలం చెల్లని వస్తువులు/పరికరాలే ఆ కిట్‌లో ఉండేలా చూడాలి.