ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
కోవిడ్ వచ్చిన పది నెలల తర్వాత విద్యార్థులు క్లాస్ రూమ్‌కి హాజరవుతున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసి క్లాస్ రూమ్‌లకు అనుమతి ఇస్తున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించి వస్తున్నారు.
ఆల్టర్నేట్ డేస్‌లో విద్యాబోధన జరుగనుంది. ఒకటవ తరగతి, మూడవ తరగతి, 5వ తరగతి క్లాస్‌లు ఒక రోజు... రెండవ తరగతి, 4వ తరగతి క్లాసులు ఒకరోజు నిర్వహించనున్నారు. స్కూల్ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారు.