శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:15 IST)

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి...
 
- ఏప్రిల్ 1న ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో గ్రంథాల ఆవిష్క‌ర‌ణ‌ జరిగింది.. 
 
- ఏప్రిల్ 6న శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.
 
- ఏప్రిల్ 8న అన్న‌మాచార్య వ‌ర్ధంతి.
 
- ఏప్రిల్ 9న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం.
 
- ఏప్రిల్ 13న ప్ల‌వ‌నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారి ఆస్థానం.
 
- ఏప్రిల్ 18న శ్రీ‌రామానుజ జయంతి.
 
- ఏప్రిల్ 21న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.
 
- ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.
 
ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం
ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళంగా అందింది. విశాఖ‌ప‌ట్నంకు చెందిన వెంక‌టహ‌ర్ష నాగ‌భ‌ట్ల 10 ల‌క్ష‌లా 511 రూపాయ‌లు, హైద‌రాబాద్‌కు చెందిన హ‌నుమ ఆక‌ర్ష్ రామ్‌చ‌రిత్ 10 ల‌క్ష‌లా 5 వేలా 11 రూపాయ‌లు విరాళంగా అందించారు.

దాతలు ఈ విరాళాల డిడిల‌ను తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.