శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (09:19 IST)

ఏప్రిల్ లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు!

ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.

ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు నిర్వహిచేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించినా, ఆయన ఒప్పుకోక పోవడంతో ఈ నెలలో జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు.

దీంతో వచ్చే నెల 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్న కొత్త యెస్ ఈసి నీలం సాహ్నీ ఆధ్వర్యంలో పరిషత్ పోరు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

వీటితో పాటు రాష్ట్రంలో మిగిలిన 22 మున్సి పాలిటీ లు, మూడు కార్పొరేషన్లకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. ఆ ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక అనంతరం మే 2వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈలోపే పరిషత్ ఎన్నికలతో పాటు మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వ్యాసి నేషన్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ప్రభుత్వం బానిస్తోంది. అదే క్రమంలో పరిపాలనలో కూడా వేగాన్ని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.
 
గతేడాది వాయిదా పడిన పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో కొత్త ఎస్ నే నీల్ల సాహ్నీ బాధ్యతలు చేపట్టగానే నోటిఫికేషన్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అయితే నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో గతంలో వాయిదా పడిన దగ్గరి నుంచే విర్వహిస్తారా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.

కాగా, ప్రభుత్వం మాత్రంవాయిదా పడిన దగ్గర నుండే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని, ఇదే క్రమంలో మిగిలిన మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది
 
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిషత్ పోరును సాధ్యమైనంత త్వరగా ముగించేస్తే ఆ తర్వాత పాలనపై దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ లెక్కన ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ ఇస్తే రెండో వారానికి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తు ప్పారు.

గతంలో ఆగిన బోటు మంచి నిర్వహిస్తే ఏకగ్రీవాలు మినహా మిగిలిన స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. ఆరా కాదని కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే ఇంకాస్త ఆలస్యం కావొచ్చు. కాగా గతేడాది కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

అయితే అప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. వీటిలో ఏమైనా అక్రమాలు జరిగాయోమో అన్న అనుమానంతో విచారణకు ఆదేశించిన ఎన్మనీ నిమ్మగడ్డ రమేష్ ఏకగ్రీవమైన అభ్యర్థులకు ఫామ్ 10 ఇవ్వకుండా ఆపారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఫామ్ 10 ఇవ్వక తప్పలేదు, అంటే అప్పట్లో ఏకగ్రీవాలకు ఆమోదముద్ర పడినట్లే.

అయితే ఎన్నికలు రద్దయి కొత్త కజిఫికేషన్ వస్తే మాత్రం ఈ విగ్రీవాలను కూడా రద్దు చేయాలి. విపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆగిన చోట నుంచే ఎన్నికలకు మొగ్గు చూపుతోంది.