గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (10:27 IST)

ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా

ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేసుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 10న నగర పాలక సంస్థకు అన్ని మున్సిపాల్టీలతోపాటు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ తీర్పు వెలువరిస్తానని చెప్పింది.

తర్వాత 24వ తేదీకి వాయిదా వేయగా, డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని తెలిపింది. ఆ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఓట్ల లెక్కింపుపై తీర్పు వెలువరిస్తామని తెలిపింది.