మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:52 IST)

ఏపీలో రేపే మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు

ఏపీలో ఈ నెల పదిన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్లను ఆదివారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రక్రియ ప్రారంభమై సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు గత బుధవారం పోలింగ్‌ జరిగింది.

అయితే, కోర్టు ఉత్తర్వులున్న ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాల్టీల ఫలితాలను మాత్రం ప్రకటించడం లేదని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపుపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి దాటే వరకు లెక్కింపు జరగడం వల్ల ఎన్నో ఇబ్బందులొచ్చా యని, అందువల్ల ఈసారి సాయంత్రంలోపు లెక్కింపు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది.

ఈ మేరకు జిల్లాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఆదివారం ఉదయం అభ్యర్థులు, వారి తరుఫు ఏజెంట్లు 14న ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్‌ ప్రాంతానికి హాజరు కావాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడు గంటలకు బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. ఫలితాలు వచ్చాక ఈ నెల 18న మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులిచ్చింది. మేయర్‌ ఎన్నికకు ప్రిసైడింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్లు ఉంటారు.