కన్నకూతురు వేధింపులతో తల్లిదండ్రుల ఆత్మహత్య.. బతికుండగానే శ్మశానంలో?
తూర్పు గోదావరి జిల్లాలో కన్నకూతురు వేధింపులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడితే.. అమలాపురంలో కన్నతల్లి బతికుండగానే శ్మశానంలోనే వదిలిపోయాడు ఓ కసాయి కొడుకు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల
తూర్పు గోదావరి జిల్లాలో కన్నకూతురు వేధింపులు తాళలేక వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడితే.. అమలాపురంలో కన్నతల్లి బతికుండగానే శ్మశానంలోనే వదిలిపోయాడు ఓ కసాయి కొడుకు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ-సామర్లకోట రోడ్డులో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కన్న కూతులు వేధింపుల వల్లే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం బయట పడకుండా వృద్ధ దంపతులకు గుట్టుచప్పుడుకాకుండా దహనసంస్కారాలు చేసేందుకు బంధువుల యత్నించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరోవైపు కన్న తల్లి బతికుండగానే శ్మశానంలో వదిలి వెళ్లాడో కసాయి కొడుకు. అమలాపురం మండలం పేరూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. హనుమంతరావు అనే వ్యక్తి తన తల్లి సత్యవతి(75)ని వృద్ధ ఆశ్రమంలో వదలాలని నిర్ణయించుకున్నాడు.
అయితే అందుకు వృద్ధ ఆశ్రమాల్లో అనుమతి నిరాకరించడంతో హనుమంతరావు తల్లిని నిర్ధాక్షణ్యంగా శ్మశానంలో వదిలి వెళ్లిపోయాడు. విషయం తెలిసిన వెంటనే సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వృద్ధురాలిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు.