శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 నవంబరు 2024 (23:02 IST)

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

image
అపోలో క్యాన్సర్ సెంటర్స్, ముంబై నేడు నిర్వహించిన అపోలో క్యాన్సర్ కాన్‌క్లేవ్ యొక్క 7వ ఎడిషన్‌కు 2,000 మందికి పైగా ఆంకాలజిస్ట్‌లు హాజరయ్యారు. వీరిలో 400 మంది ఫ్యాకల్టీతో పాటు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ క్యాన్సర్ కేర్ నిపుణులు, పరిశోధకులు కూడా ఉన్నారు. సమకాలీన చికిత్సల నుండి ప్రెసిషన్ క్యాన్సర్ చికిత్సల వరకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలను అన్వేషించటం, క్యాన్సర్ సంరక్షణలో తాజా పురోగతులు, ఆవిష్కరణలను చర్చించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
 
నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, రీసెర్చ్ ప్రెజెంటేషన్‌లలో పాల్గొనడానికి శక్తివంతమైన వేదికను అందించింది. గుర్తింపు పొందిన, అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్ సంరక్షణ చికిత్సలు, నిర్వహణ వ్యూహాల గురించి కీలకోపన్యాసం, పలు చర్చా కార్యక్రమాలు అమూల్యమైన పరిజ్ఞానం అందించాయి. ఏడు అవయవ-నిర్దిష్ట శాస్త్రీయ ట్రాక్‌లతో, 100 కంటే ఎక్కువ సెషన్‌లు, అనేక ఇంటరాక్టివ్ చర్చలతో, అపోలో క్యాన్సర్ కాన్క్లేవ్ ఆంకాలజీ విభాగంలో అత్యంత కీలకంగా నిలిచింది. క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా, సానుభూతితో ఎదుర్కోవడానికి అంకితమైన ఆంకాలజీ నిపుణుల కోసం ఇది ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ క్యాలెండర్‌లో కీలకమైన కార్యక్రమంగా ఇది నిలిచింది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్ సి) డైరెక్టర్ డాక్టర్ ఎలిసబెట్ వీడర్‌పాస్ మాట్లాడుతూ, “ఐఏఆర్ సి యొక్క 2022 అంచనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రపంచ క్యాన్సర్ భారం 2022లో 20 మిలియన్ల కొత్త కేసుల నుండి 2050 నాటికి 35 మిలియన్లకు పెరుగునున్నాయి. ప్రధానంగా అల్పాదాయ, మధ్యతరహా ఆదాయ దేశాలపై ప్రభావం చూపనుంది. భారతదేశంలో, క్యాన్సర్ భారం 2022లో 1.41 మిలియన్ల కొత్త కేసుల నుండి 2050 నాటికి 2.69 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఈ భయంకరమైన అంచనాల నేపథ్యంలో, క్యాన్సర్ మహమ్మారికి నివారణ అనేది కీలక ప్రతిస్పందనగా మారింది. అపోలో క్యాన్సర్ కాన్క్లేవ్ 2024 వంటి కార్యక్రమాలు స్థానిక నిపుణులలో అవగాహన పెంచేందుకు అమూల్యమైన వేదికను అందిస్తున్నాయి. ఐఏఆర్ సి వద్ద, మా లక్ష్యం వీలైనంత తక్కువ మంది మాత్రమే క్యాన్సర్‌ బారిన పడ్డామని చెప్పేలా చేయటం. ఇలా జరగాలంటే, నివారణ, ముందస్తుగా గుర్తించడంలో చురుకైన, నిరూపిత-ఆధారిత వ్యూహాలు అవసరం. ఈ వ్యూహాలను పంచుకోవడానికి, మా సామూహిక మిషన్‌ను బలోపేతం చేయడానికి ఈ సదస్సు ఒక గొప్ప అవకాశం" అని అన్నారు. 
 
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి ప్రీతారెడ్డి మాట్లాడుతూ, “ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించాలనే లక్ష్యంతో అపోలో హాస్పిటల్స్ స్థాపించబడింది. నూతన ప్రమాణాలు, అధునాతన సాంకేతికతలు, వినూత్న చికిత్సల ద్వారా క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చేయడం ద్వారా మేము ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాము, విస్తృత స్థాయిలో రోగులకు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. మా 22 అపోలో క్యాన్సర్ సెంటర్‌లలో 390 మందికి పైగా ఆంకాలజిస్ట్‌లతో, మేము ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వాటిని ప్రమాణంగా తీసుకుని ప్రేమతో , రోగి-కేంద్రీకృత సంరక్షణను అందిస్తున్నాము. అపోలో క్యాన్సర్ కాన్‌క్లేవ్ ప్రారంభోత్సవం భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన  ఆరోగ్య సంరక్షణను తీసుకురావాలనే  మా నిబద్ధతను వెల్లడిస్తుంది.." అని అన్నారు. 
 
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌లో గ్రూప్ ఆంకాలజీ & ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ దినేష్ మాధవన్ మాట్లాడుతూ, “మేము అభివృద్ధి చెందుతున్న ఆంకాలజీ రంగంలో లోతుగా పరిశోధిస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న సంచలనాత్మక ఆవిష్కరణలను గుర్తించడం చాలా కీలకం. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో గణనీయమైన పురోగతులు మరియు మా సుశిక్షితులైన వైద్యులు , అత్యాధునిక సాంకేతికతలతో, మేము ఆంకాలజీ రంగాన్ని పునర్నిర్మించడం కొనసాగిస్తున్నాము. నేడు, క్యాన్సర్ సంరక్షణ అంటే సమగ్రమైన మద్దతును అందించడం. క్యాన్సర్ నిర్వహణ మరియు చికిత్సలో సాంకేతిక పురోగతికి అనుగుణంగా, అపోలో క్యాన్సర్ సెంటర్లు ఈ పరివర్తన ప్రయాణంలో ముందంజలో ఉన్నాయి, 147 దేశాలలో 3.5 బిలియన్ల ప్రజలకు సేవలు అందిస్తోన్నాయి" అని అన్నారు. 
 
అపోలో హాస్పిటల్స్ నవీ ముంబైలో ఆంకాలజీ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ డి క్రూజ్ మాట్లాడుతూ, “గ్లోబల్ ఆంకాలజీ కమ్యూనిటీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కార్యక్రమంగా అపోలో క్యాన్సర్ కాన్క్లేవ్ మారింది, ఇది క్యాన్సర్ కేర్‌ను మార్చడానికి అంకితమైన ఆలోచనాపరులు, అభ్యాసకులు మరియు పరిశోధకులను ఒకచోట చేర్చింది. జ్ఞానాన్ని పంచుకోవడం మరియు సహకారం ద్వారా క్యాన్సర్ చికిత్సను ప్రేరేపించడం, సవాలు చేయడం మరియు సమిష్టిగా ముందుకు తీసుకెళ్లడం మా లక్ష్యం. ప్రెసిషన్  ఆంకాలజీపై ఈ సంవత్సరం దృష్టి సారించటం వల్ల క్యాన్సర్ చికిత్సకు మరింత అనుకూలమైన, రోగి-కేంద్రీకృత విధానాల వైపు మారడాన్ని నొక్కి చెబుతుంది, చివరికి క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రతి రోగికి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.."అని అన్నారు. 
 
ఈ కాన్క్లేవ్ లో బ్రెస్ట్, గైనకాలజీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్, తల, మెడ, యూరో-ఆంకాలజీ, హెమటోలింఫోయిడ్ క్యాన్సర్‌లతో సహా ఆంకాలజీకి సంబంధించిన వివిధ విభాగాలను స్పృసిస్తూ విస్తృత శ్రేణి సెషన్‌లు ఉన్నాయి. కీలకోపన్యాసాలు, ఇంటరాక్టివ్ ప్యానెల్‌లు, రియల్-టైమ్ కేస్ డిస్కషన్‌లతో, ఈ కార్యక్రమం క్యాన్సర్ కేర్‌లో సాంకేతికత, ఖచ్చితమైన ఔషధం యొక్క పరివర్తన సామర్థ్యాన్ని హైలైట్ చేసింది, రోగి-కేంద్రీకృత ఆవిష్కరణలను నొక్కి చెప్పింది. ఈ కాన్క్లేవ్ యొక్క ప్రధాన ప్రకటనలలో ఒకటి అపోలో యొక్క కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ మార్గదర్శకాలను పరిచయం చేయడం, ఇది భారతదేశం అంతటా రొమ్ము క్యాన్సర్ ఎలా నిర్వహించబడుతుందో పునర్నిర్వచించటానికి నిర్దేశించబడినది.