బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (18:54 IST)

"దేవర" చూసేంతవరకు బతికించండి.. బాబు, పవన్ గారూ?: ఎన్టీఆర్ వీరాభిమాని (video)

NTR Fan
NTR Fan
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని గుండెలు పిండే స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  తిరుపతికి చెందిన కౌశిక్‌ (19) కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడు 'దేవర' మూవీని చూడాలని చివరి కోరికను తెలియజేశాడు. ఇదే తన చివరి కోరిక అని.. తన కోరికను తీర్చాలని వేడుకున్నాడు. 
 
ఈ విషయాన్ని కౌశిక్ తల్లిదండ్రులు మీడియాతో వెల్లడించారు. తమ బిడ్డ జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని.. దేవర సినిమా చూసేవరకు తన బిడ్డను కాపాడాలని వైద్యులను వేడుకున్నారు. "నా బిడ్డను బతికించండయ్యా. చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు నా బిడ్డ చివరి కోరిక తీర్చండి" అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. 
 
19 ఏళ్ల వయసులోనే ప్రాణాపాయంలో ఉన్న కౌశిక్ గురించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతడిని బతికించడం కోసం స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు.