సోమవారం, 4 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:35 IST)

అభిరామికి నేను అభిమానిని, ఎప్పుడూ తల్లిగా చూడలేదు : రాజ్ తరుణ్

Abhirami-Rajtarun
Abhirami-Rajtarun
రాజ్ తరుణ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయినా ఆయనకు వరుసగా సినిమా ఛాన్స్ లు వస్తూనే వున్నాయి. తాజాగా దర్శకుడు మారుతీ కథ అందిస్తూ, నిర్మిస్తున్న సినిమా భలే ఉన్నాడే చేశాడు. విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడారు. నటి అభిరామి ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా నటించింది. చిత్ర దర్శకుడు సుబ్బును ఉద్దేశించి మాట్లాడుతూ, అభిరామి క్రష్ అన్నారు మదర్ పాత్ర ఇచ్చారేమిటి: రాజ్ తరుణ్ ప్రశ్నించారు. వెంటనే దర్శకుడు క్రష్ కాబట్టే ఇచ్చామని సరదాగా అన్నారు. 
 
ఇక రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఉయ్యాల జంపాల తర్వాత దర్శకుడు మారుతీగారు నన్ను పిలిచారు. కానీ ఇంతకాలం సెట్ అయింది. భలే వున్నాడే సినిమా వచ్చేలా చేశారు. నిర్మాత కిరణ్ చాలా నమ్మి సినిమాను తీశారు. శేఖర్ చంద్ర నేను కాంట్రాక్ట్ తీసుకుందామను కుంటున్నాం. దర్శకుడు మారుతీ, కెమెరామెన్ నన్ను భలే ఉన్నాడే అనిపించేలా చేశారు నన్ను. 
 
ఇంకా చెప్పాలంటే, నేను అభిరామి అభిమానిని. ఆమెను నాకు మదర్ గా చూపించారు. తను ఏ సీన్ లో నాకు మదర్ అనిపించదు. ఆమె లుక్ లైక్ సిస్టర్ ఓన్లీ అంటూ వ్యాఖ్యానించారు.  ఇక సింగీతం శ్రీనివాస్ గారి సినిమాలు చూశాను. అలాంటి ఆయనతో కలిసి నాలుగు రోజులు కలిసి నటించడం గొప్ప అనుభవం. చాలా నేర్చుకున్నాను అన్నారు.