బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 29 ఆగస్టు 2024 (23:12 IST)

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

Dr Saisnehit
తీవ్ర స్థాయి నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల రోగికి విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు మరో మైలురాయిని సాధించింది. రోగి తన నాలుక యొక్క కుడి వైపున పుండు ఉందని, అది నొప్పిని కలిగించడంతో పాటుగా తినేటప్పుడు మంటగా వుంటుందనే సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చారు. శ్రీ రాధాకృష్ణ మూర్తి సూరపనేని స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. డాక్టర్ సాయి స్నేహిత్ యొక్క నైపుణ్యంతో కూడిన సంరక్షణలో రాడికల్ రేడియోథెరపీతో కూడిన కఠినమైన చికిత్స ప్రణాళికను రోగి పొందారు.
 
భారతదేశంలో, మొత్తం క్యాన్సర్లలో మూడింట ఒక వంతు తల, మెడ క్యాన్సర్లు (హెచ్‌ఎన్‌సి) ఉంటున్నాయి. బీడీ, రివర్స్ స్మోకింగ్, పొగాకు నమలడం, బీటిల్, క్విడ్ మరియు అరేకా గింజల ద్వారా హెచ్‌ఎన్‌సి ప్రమాదం పెరుగుతుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (ఏపీ)లోని కొంతమంది వ్యక్తుల సమూహంలో రివర్స్ స్మోకింగ్ గమనించబడింది. సిగరెట్ యొక్క వెలుగుతున్న చివర నుండి వేడి, టాక్సిన్స్‌కు దీర్ఘకాలికంగా బహిర్గతం కావడం వలన నోటి కుహరంలో కణజాల నష్టం జరగటంతో పాటుగా వాపు సహా విభిన్న సమస్యలు ఏర్పడతాయి. ఈ మార్పులు ఇతర నిరపాయమైన పరిస్థితులను అనుకరించవచ్చు, ముందుగా గుర్తించడం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ కీలకం. రివర్స్ స్మోకింగ్ యొక్క అత్యంత ప్రముఖ ప్రభావం అంగిలి, నాలుకపై కనిపిస్తుంది.
 
సిటిఎస్ఐ-దక్షిణాసియా సీఈఓ, హరీష్ త్రివేది మాట్లాడుతూ, “శ్రీ సూరపనేని విజయగాథ, విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణకు ఉన్న అవకాశాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఏఓఐ వద్ద, మేము తమ ఇంటికి దగ్గరగా అత్యాధునిక చికిత్స అవకాశాలను తీసుకురావడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. రోగులు, వారి కుటుంబాలు వారున్న ప్రాంతాలతో సంబంధం లేకుండా అగ్రశ్రేణి వైద్య సదుపాయాన్ని పొందుతున్నారనే విశ్వాసం కల్పించటం ద్వారా వారిని శక్తివంతం చేయడం మా లక్ష్యం. కానూరులో సాధించిన ఈ విజయం దక్షిణాసియా అంతటా క్యాన్సర్ సంరక్షణను మార్చాలనే మా అంకితభావాన్ని వెల్లడి చేస్తుంది" అని అన్నారు.
 
విజయవాడలోని ఏఓఐ కానూరులో మా బృందం అందించిన అసాధారణమైన చికిత్స పట్ల మేము ఎంతో గర్విస్తున్నాము అని ఏఓఐ విజయవాడ, RCOO, మహేందర్ రెడ్డి అన్నారు. శ్రీ సూరపనేని కేసు రోగి-కేంద్రీకృత విధానంతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. మా అత్యాధునిక సౌకర్యాలు, అంకితమైన వైద్య నిపుణులు క్యాన్సర్ చికిత్సలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉన్నారు, మా అత్యంత సీనియర్ రోగులు కూడా అత్యున్నత నాణ్యమైన సంరక్షణను పొందేలా చూస్తారు" అని అన్నారు.
 
రాడికల్ రేడియోథెరపీ అనేది వ్యాధిని నయం చేసే లేదా గణనీయంగా తగ్గించే ఉద్దేశ్యంతో క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, నాశనం చేయడానికి అధిక మోతాదులో రేడియేషన్‌ను ఉపయోగించే చికిత్స యొక్క ఒక రూపం. లక్షణాల నుండి ఉపశమనానికి ఉద్దేశించిన పాలియేటివ్ రేడియోథెరపీ కాకుండా, రాడికల్ రేడియోథెరపీ మరింత ఖచ్చితత్త్వంతో ఉంటుంది మరియు కణితిని పూర్తిగా నిర్మూలించడంపై దృష్టి పెడుతుంది. కణితి చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి హానిని తగ్గించడానికి చికిత్స జాగ్రత్తగా ప్రణాళిక చేయబడింది.
 
ఈ చికిత్సపై డాక్టర్ సాయి స్నేహిత్, రేడియేషన్ ఆంకాలజీ, ఏఓఐ విజయవాడ వారు మాట్లాడుతూ, “శ్రీ  సూరపనేని వయస్సు మరియు క్యాన్సర్ యొక్క దూకుడు స్వభావం కారణంగా అతని కేసు చాలా సవాలుగా ఉంది. అయినప్పటికీ, కానూరు సదుపాయంలోని ఏఓఐలో అందుబాటులో ఉన్న అధునాతన రేడియోథెరపీ పద్ధతులతో, దుష్ప్రభావాలను తగ్గించేటప్పుడు మేము కణితిని సమర్థవంతంగా లక్ష్యంగా చేసుకోగలిగాము. చికిత్స ప్రక్రియ అంతటా రోగి విశేషమైన స్థిరత్వంను చూపించారు. అతని పురోగతికి మేము సంతోషిస్తున్నాము. ఈ కేసు వ్యక్తిగతీకరించిన సంరక్షణ ప్రణాళికల యొక్క ప్రాముఖ్యతను, సంక్లిష్ట క్యాన్సర్ కేసులను ఖచ్చితత్వంతో నిర్వహించగల మా బృందం యొక్క సామర్థ్యాన్ని వెల్లడి చేస్తుంది" అని అన్నారు.
 
శ్రీ సూరపనేని యొక్క విజయవంతమైన చికిత్స ఏఓఐ కానూరు, ఈ ప్రాంతంలో ఒక ప్రముఖ క్యాన్సర్ సెంటర్‌గా విజయవాడ యొక్క స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది, సమగ్రమైన, కరుణతో కూడిన క్యాన్సర్ సంరక్షణను అందించడానికి ఏఓఐ కట్టుబడి ఉంది. ఏఓఐ ఆంకాలజీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది, ఈ ప్రాంతం అంతటా రోగులకు ఆశ మరియు మెరుగైన జీవన నాణ్యతను అందిస్తోంది.