శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (17:02 IST)

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్ : ఎర్రగడ్డ రైతు బజారులో పాత రూ.500కు ఉల్లిపాయలు

హైదరాబాద్ వాసులకు శుభవార్త. పాత కరెన్సీ నోట్లు మార్పిడి చేసుకోలేని వారి కోసం ఎర్రగడ్డ రైతు బజార్‌లో కేంద్రీయ భండార్ అనే సంస్థ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని రైతుబజార

హైదరాబాద్ వాసులకు శుభవార్త. పాత కరెన్సీ నోట్లు మార్పిడి చేసుకోలేని వారి కోసం ఎర్రగడ్డ రైతు బజార్‌లో కేంద్రీయ భండార్ అనే సంస్థ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని రైతుబజార్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. అక్కడ పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకొని అంతే విలువైన నిత్యావసరాలను ఇస్తున్నారు. 
 
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైతు బజార్లు, కిరాణషాపులు, పండ్ల మార్కెట్లు జనాలు లేక పది రోజుల నుంచి వెలవెలబోతున్నాయి. చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్చుకోలేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పడిపోవడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. 
 
ఇక తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు తదితర చిరు వ్యాపారాల పరిస్థితి దారుణం. ఈ నేపథ్యంలో కేంద్రీయ భండార్‌ సంస్థ ఎర్రగడ్డ రైతు బజార్‌లో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాత రూ.1000, రూ.500 నోట్లకు నిత్యావసర వస్తువులను అందించి పాతనోట్ల మార్పిడి వెసులుబాటును కల్పించడంతో ఎర్రగడ్డ రైతుబజారులో పాత నోట్ల మార్పిడి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.