సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (13:01 IST)

పెళ్లి చూపులకు ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ఒరాకిల్ టెక్కీ

పెళ్లి చూపుల నిమిత్తం పంపాల్సిన ఫోటోలు తీయించుకునేందుకు వెళుతూ ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన కర్నూలులో జరిగింది. ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చేసింది.

పెళ్లి చూపుల నిమిత్తం పంపాల్సిన ఫోటోలు తీయించుకునేందుకు వెళుతూ ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన కర్నూలులో జరిగింది. ఓ మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చేసింది. ఇక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆ యువకుడు ఆలోచిస్తే, విధి మరొకటి లిఖించింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
జగన్ మోహన్ రెడ్డి (31) అనే వ్యక్తి బెంగుళూరులోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ టెక్కీ కర్నూలులో నివసిస్తున్న తన అక్క, బావ దగ్గరకు వచ్చాడు. పెళ్లి చూపులకు ఫోటోలు దిగేందుకు బావ లక్ష్మన్నతో కలసి బైకుపై వెళుతుండగా, పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు బలమైన గాయం తగలడంతో జగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసు అధికారులు, ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.