కోవిడ్ రోగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు
కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. వెన్నెల స్లీపర్ ఎసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించాం. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో రోగులకు బస్సుల్లోనే వైద్య సేవలు అందిస్తాం అన్నారు.
"బస్సుల్లో ఏర్పాట్లు సహా సదుపాయాలను మంత్రికి ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ వివరించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... ఒక ఆర్టీసీ స్లీపర్ బస్సులో పది మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందిస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులను ఏర్పాటు చేస్తాం.
ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్సీల్లో ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతాం.10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తాం" అన్నారు.