ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (15:59 IST)

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న జనసేనాని

Pawan Kalyan
విజయదశమని పండుగను పురస్కరించుకుని అక్టోబరు ఐదో తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ నెల 26వ తేదీకి పూర్తి స్థాయిలో సిద్ధంకానుంది. ఈ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఈ బస్సులోనే ఉంటారు. అందువల్ల అందుకు తగినట్టుగా ఇందులో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 
 
అయితే, ఈ యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఈ నెల 18వ తేదీన అధికారికంకా ప్రకటిస్తారు. అలాగే, యాత్ర ఎన్ని విడతలుగా జరగాల్సి, ఏయే మార్గాలను కలపాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తర్వాత  అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు.