బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:15 IST)

పవన్ కళ్యాణ్ పుణ్యమా అని వైసిపిలో ఎమ్మెల్యేకు మంత్రి పదవి, ఎవరు?

సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్య ఎపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చేతికాని పాలన అంటూ జగన్ రెడ్డిపై విమర్సలు గుప్పిస్తున్నారు. ప్రెస్ నోట్ల నుంచి ప్రెస్ మీట్ల వరకు వచ్చేశారు జనసేనాని. ఇప్పుడిదే వైసిపి నేతలకు మింగుడు పడటం లేదు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‍ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్థమవుతున్నారు వైసిపి నేతలు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను రంగంలోకి దించేందుకు సిద్థమవుతున్నారట. 
 
రాజకీయంగానే పవన్‌ను ఎదుర్కోవాలని..అందులోను ఆయన్ను ఓడించిన వ్యక్తినే రంగంలోకి దింపి విమర్సలు గుప్పిస్తే కాస్త సైలెంట్ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే వైసిపి ముఖ్య నేతలు పెద్ద స్కెచ్ వేశారట.
 
త్వరలో మంత్రుల మార్పులు చేర్పులు ఉన్న విషయం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రుల మార్పు ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. దీంతో చాలామంది ఆశావహులు పదవుల కోసం పోటీలు పడుతున్నారు. మరికొంతమంది పదవులు పోతుందని ఆందోళనలో ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయంలో ఉన్నారట. ఈ విషయాన్ని సిఎం దృష్టికి కూడా స్థానిక నేతలు తీసుకెళ్ళారట. జనసేనను ఎదుర్కోవాలంటే శ్రీనివాస్ ఒక్కటే మార్గమని.. విమర్సలతో పవన్ కళ్యాణ్ ను కట్టడి చేయవచ్చని అధినేత దృష్టికి తీసుకెళ్ళారట.
 
దీంతో జగన్ గ్రంథి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైందట. అయితే ఏ శాఖ అన్న దానికన్నా మంత్రి పదవి రావడం మాత్రం ఖాయమనేది తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ వైసిపిలో ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి రాబోతోందంటూ ఆ పార్టీలోనే ప్రచారం జరుగబోతోందట