గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (10:33 IST)

విశాఖలో పవన్ కళ్యాణ్ .. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు సపోర్టు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్టణంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు పవన్‌ మద్దతు తెలుపనున్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్టణంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు పవన్‌ మద్దతు తెలుపనున్నారు. అలాగే, ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని జనసేనాని పరామర్శించనున్నారు. అనంతరం సాయంత్రం జనసైనికుల సమావేశంలో పాల్గొననున్నారు.  
 
తమకు న్యాయం చేయాలంటూ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం ఆయన విశాఖకు చేరుకున్నారు. ఆయనకు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. డీసీఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ, వెంకటేష్ అత్మహత్య చేసుకోగా, ఉద్యోగులు ఆందోళన ప్రారంభించిన సంగతి తెలిసిందే.
 
అలాగే, కృష్ణా నది పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి అన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ల తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని, పోరాడి సాధించుకోవాలని చెప్పారు. అందుకు తనతోపాటు జనసేన కూడా అండగా నిలుస్తుందని పవన్ తెలిపారు.