బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:14 IST)

అజ్ఞాతవాసి సాంగ్ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ వద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, కీర్తీ సురేష్, అనూ ఇమ్మానుయేల్, ఆది, కుష్బూ, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా పవన్ అజ్ఞాతవాసి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
ఇకపోతే.. అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్‌లలో విడుదల కాబోతోంది. ఏకంగా 249 ప్రాంతాల్లో విడుదల కానుంది. మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.