శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (10:27 IST)

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్: 25న సాయంత్రం 6 గంటలకు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో వారణాసిలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే దసరా నుంచి ఈ సినిమా ఫస్టులుక్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
 
కానీ పవన్ ఫస్ట్ లుక్ మాత్రం విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ నెల 25వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్‌ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేశారు. ఆ పాటకు అనూహ్యమైన స్థాయిలో స్పందన లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ధీటుగా వుండాలని సినీ యూనిట్ భావిస్తోంది. అనిరుధ్ అందించిన ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేసి, సినిమాను జనవరి 10వ తేదీన రిలీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది.