ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (17:28 IST)

కొడకా.. కోటేశ్వరా అంటున్న పవన్.. ఎందుకు?

అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు సాంగ్‌తో గొంతు సవరించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అదే దర్శకుడు, తన ప్రాణ స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కోసం మరోసారి పాట పాడనున్నాడు. త్రివిక్ర‌మ్ శ

అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు సాంగ్‌తో గొంతు సవరించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అదే దర్శకుడు, తన ప్రాణ స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కోసం మరోసారి పాట పాడనున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ గొంతు స‌వరించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 
 
'కొడ‌కా... కోటేశ్వ‌రా...' అంటూ సాగే పాట‌ను ప‌వ‌న్ పాడ‌నున్నార‌ని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి కొలవెరి ఫేమ్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో ప‌వ‌న్ అభిజిత్ భార్గ‌వ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని 'బ‌య‌టికొచ్చి చూస్తే' అనే పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విల‌న్‌గా బొమ‌న్ ఇరానీ, ఓ కీల‌క పాత్ర‌లో ఖుష్బూ న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని త్రివిక్రమ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.