సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:24 IST)

అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. మార్షల్ ఆర్ట్స్‌తో ఇరగదీసిన పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ 7న రిలీజ్ కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజున ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ 7న రిలీజ్ కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజున ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న మేకర్స్ పవర్ స్టార్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ప్రముఖ తమిళ కంపోజర్ అనిరుధ్ బర్త్ డే రోజున ఓ వీడియో ఇంటర్వ్యూ బయటికొచ్చింది. ఇక అలాగే ఈ సినిమాలో పవన్ సరసన జంటగా నటిస్తోన్న కీర్తి సురేష్ బర్త్ డే నాడు ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇదే తరహాలో తివిక్రమ్ పుట్టిన రోజున సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
మరోవైపు ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకోనున్నారట. పవన్ కల్యాణ్‌కి మార్షల్ ఆర్ట్స్‌ టచ్‌ వున్నా చిత్రం కోసం రెండు నెలల పాటు ప్రాక్టీస్ చేశాడని తెలుస్తోంది. ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందనీ .. సినిమాకి ఈ ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. పవన్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా ఈ ఫైట్ ఉంటుందని, ప్రస్తుతం ఈ చిత్రం యూరప్‌లో పాటల చిత్రీకరణలో వుంది.