శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (16:45 IST)

''నీతోనే డ్యాన్స్'' షో ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు: రేణూ దేశాయ్

''నీతోనే డ్యాన్స్'' షోను స్టార్ మాలో ప్రసారం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ న్యాయ నిర్ణేతగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. సీరియళ్లలో నటిస్తున్న వారితో డ్యాన్స్ ఏమిటని ఓ అభిమాని వ

''నీతోనే డ్యాన్స్'' షోను స్టార్ మాలో ప్రసారం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ న్యాయ నిర్ణేతగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. సీరియళ్లలో నటిస్తున్న వారితో డ్యాన్స్ ఏమిటని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు రేణూ దేశాయ్ చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. 
 
ఈ షో డ్యాన్సర్లకు పెడుతున్న పోటీకి సంబంధించినది కాదని తెలిపారు. ఇది వినోదం కోసం చేస్తున్నదేనని తేల్చేశారు. రియల్ కపుల్ సెలెబ్రిటీలతో కలిసి ఈ షోన చేస్తున్నామని.. ఈ షో ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. 
 
''నీతోనే డ్యాన్స్''షోలో పాల్గొనేవారికి డ్యాన్స్ రాదని, వాళ్లంతా సీరియళ్లు చేసుకుంటేనే బాగుంటుందని.. వారిని డ్యాన్సర్లుగా చూడలేకపోతున్నామని ఓ అభిమాని అడిగిన ప్రశ్న రేణు దేశాయ్ చాలా కూల్‌గా సమాధానం ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.