మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (13:08 IST)

ఆ ముగ్గురి వల్లే ఇండస్ట్రీలో వున్నా.. లేకుంటే చలపతిరావు కామెంట్స్‌తో?: యాంకర్ రవి

గతంలో చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, ''సూపర్ సర్'' అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్య

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా  గరుడ వేగ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చలపతిరావు మాట్లాడుతూ.. అసలు పని ఉందే మోకాళ్లతో. అలాంటిది మోకాళ్లపై రాజశేఖర్ డ్యాన్సులు చేస్తున్నాడని అన్నారు.

దాంతో కార్యక్రమానికి హాజరైన వారందరూ గొల్లున నవ్వారు. దాంతో ఇదేదో మరి ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించిన చలపతి రావు వెంటనే కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మోకాళ్లు అంటే నడవటానికి అవసరం కదా. ప్రతీ మాటను తప్పుపట్టవద్దన్నారు. 
 
గతంలో చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, ''సూపర్ సర్'' అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని యాంకర్ రవి తెలిపాడు. అయితే తానింకా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం శ్రీముఖి ఇచ్చిన ధైర్యమని రవి తెలిపాడు. 
 
టెక్నికల్ ఇష్యూ వల్ల చలపతిరావు ఏమన్నారో తనకు తెలియదని.. వివరణ ఇచ్చినా ఎవ్వరూ వినిపించుకోలేదని యాంకర్ రవి అన్నాడు. ఆ సమయంలో ఇంట్లో కూడా అమ్మ, నాన్న, చెల్లితో పాటు ఎక్కడికి వెళ్లినా అందరూ దీనిపైనే ప్రశ్నించేవారని, తన తండ్రి కూడా తన మాట నమ్మలేదని రవి అన్నాడు.

ఆ టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుంచి వళ్లిపోదామనుకున్నానని చెప్పాడు. అయితే అలాంటి సమయంలో తనకు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని అన్నాడు. వారు ముగ్గురూ ఇచ్చిన సపోర్ట్‌తోనే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడ్డానని తెలిపాడు.