శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (17:50 IST)

అందుకే బిగ్ బాస్ హౌస్‌లో కాలుపెట్టలేదు: ఫేస్‌బుక్ లైవ్‌ఛాట్‌లో శ్రీముఖి

తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనలేకపోయినందుకు గల కారణాన్ని టాప్ యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. కోలీవుడ్ తరహాలో, టాలీవుడ్‌లో అర్థశతదినోత్సవం జరుపుకున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌లో తనకు అవకాశం లభించిన మాట నిజ

తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనలేకపోయినందుకు గల కారణాన్ని టాప్ యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. కోలీవుడ్ తరహాలో, టాలీవుడ్‌లో అర్థశతదినోత్సవం జరుపుకున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌లో తనకు అవకాశం లభించిన మాట నిజమేనని శ్రీముఖి తెలిపింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌‌లో తన అభిమానులతో లైవ్ ఛాట్‌లో శ్రీముఖి తెలిపింది. 
 
కామెడీ షోలతో చాలా చాలా బిజీగా ఉన్నందువల్లే బిగ్ బాస్‌లో పాల్గొనలేకపోయానని స్పష్టం చేసింది. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనపోవడానికి పలు రకాలుగా వార్తలొచ్చాయని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ షోకు దూరమయ్యానని చెప్పింది. అయితే తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని, తాను సరిగ్గా ఓ షోకు ఒప్పుకున్న మరుసటి రోజే బిగ్ బాస్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందిందని.. ఈ కారణంతోనే బిగ్ బాస్ హౌస్‌లో కాలుపెట్టలేకపోయానని క్లారిటీ ఇచ్చింది. 
 
కాగా మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోకు భారీ క్రేజ్ లభిస్తోంది. ఈ షోలో ముందు క్రేజున్న స్టార్లను దించాలనుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా టాప్ స్టార్లు ఈ షోలో పాల్గొనలేకపోయారని టాక్ వస్తోంది.