శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (13:37 IST)

సత్యాన్ని అపవిత్రం చేసిన పవన్ : వీడియో పోస్ట్ చేసిన వర్మ (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు విమర్శలు గుప్పించారు. ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అస‌త్యం పలికాడ‌ంటూ ఓ సెటైర్ వేస్తూనే తన త‌న ఫేస్‌బుక్ ఖాతాలో వర్మ ఓ వీడియో ప

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు విమర్శలు గుప్పించారు. ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అస‌త్యం పలికాడ‌ంటూ ఓ సెటైర్ వేస్తూనే తన త‌న ఫేస్‌బుక్ ఖాతాలో వర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. 
 
పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. ఇది స‌త్యాన్ని అప‌విత్రం చేయ‌డ‌మేన‌ని, ఇది విన్న వారి రియాక్ష‌న్ ఇలా ఉంద‌ని చెబుతూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన ఆ ఒక్క ప‌దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తూ విప‌రీత‌మైన కామెడీని జోడించాడు వ‌ర్మ‌. ఆ వీడియోను మీరూ చూడండి...