మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (12:15 IST)

పవన్ కల్యాణ్ ''అజ్ఞాతవాసి'' ఫస్ట్ లుక్ ఇదే..

ఫ్యాన్స్ అనుకున్నట్టే జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిలే ఖరారైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో పవన్ కల్యాణ్ లుక్

ఫ్యాన్స్ అనుకున్నట్టే జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిలే ఖరారైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో పవన్ కల్యాణ్ లుక్ విడుదలైంది. సినిమా టైటిల్ కూడా అజ్ఞాతవాసి అని ఖరారైంది. 
 
పవన్ లుక్, టైటిల్ పేరుతో కూడిన పోస్టర్‌ను ఆ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో సోమవారం పోస్టు చేసింది. సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు పోస్టర్లో వుంది. ఈ లుక్‌లో పవన్ స్మార్ట్‌గా కనిపించాడు. 
 
చేతిలో ఐటీ ఐడీ కార్టు పెట్టుకుని సోఫాపై కాలు పెట్టుకుని కూర్చున్న పవన్ చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నటించే కీర్తి సురేష్ కూడా తన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయంటూ ఓ ఫోటోను నెట్లో  పోస్ట్ చేసింది. ఇకపోతే.. పవన్ కల్యాణ్ రెండో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. పికె క్రియేటివ్ వర్క్స్ పేరిట మరో కొత్త ట్విట్టర్ అక్కౌంట్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.