శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (13:11 IST)

జనవరి 26 భాగమతి విడుదల..

భాగమతి విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి బిజీ షెడ్యూల్ కారణంగా లేట్ అవుతూ వచ్చింది. బాహుబలి నుంచి ఫ్రీ అవ్వగానే భాగమతి షూటింగ్‌ని అనుష్క కంప్లీట్ చేసేసింది. పిల్ల జమీందార

భాగమతి విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి బిజీ షెడ్యూల్ కారణంగా లేట్ అవుతూ వచ్చింది. బాహుబలి నుంచి ఫ్రీ అవ్వగానే భాగమతి షూటింగ్‌ని అనుష్క కంప్లీట్ చేసేసింది. పిల్ల జమీందార్ ఫేం అయిన జి.అశోక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ఇంకా ప్రమోద్ నిర్మిస్తున్నారు. 
 
తాజాగా దేవసేన పుట్టిన రోజును పురస్కరించుకుని టెర్రిఫిక్ లుక్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. 
 
మూవీలో గ్రాఫిక్స్ వర్క్ చక్కగా ఇచ్చేందుకు టీమ్ కృషి చేస్తోందని.. అందుకే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా లేట్ అవుతుంది. దీంతో భాగమతిని జనవరి 26న విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. ఇప్పటికే  డిసెంబర్‌లో అఖిల్ ''హలో'' ఇంకా నాని ''ఎంసిఏ'' చిత్రాలు విడుదల కానున్నాయి.