శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (17:20 IST)

రోడ్డు నిర్మాణ పనులు - ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan kalyan
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని ఉరుకులుపరుగులు పెట్టిస్తున్నారు. ఆయన శుక్రవారం రోడ్డు నిర్మాణ పనులతో పాటు.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి తిరిగి వెళుతున్న ఇద్దరు మెగా ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రమాదానికి గురైన స్థలాన్ని పవన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన అధికారులను అడిగి  తెలుసుకున్నారు. 
 
తన సొంత నియోజకవర్గం పిఠాపురంకు ఆయన శుక్రవారం వెళ్లారు. ఇందుకోసం రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే మార్గంలో రామస్వామిపేట వద్ద నిర్మిస్తున్న ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? తదితర వివరాలను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఇతర అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలినడకన వెళ్తూ డ్రెయిన్‌ సౌకర్యం, నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. 
 
అలాగే, కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23), చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు పమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం ముకుందవరం గ్రామ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన కాకినాడ - రాజమండ్రి మధ్య ప్రమాదస్థలిని ఆయన పరిశీలించారు. 
 
పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ! 
పండగ వేళ ప్రయాణికులను ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ఈ ప్రయాణ చార్జీలు షాక్‌కు గురిచేస్తున్నాయి. రైళ్లన్నీ ఫుల్ కావడంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి జేబులను ప్రైవేట్ బస్సు యజమానులు క్షవరం చేస్తున్నారు. రెగ్యులర్ బస్సు సర్వీసులు ఫుల్ కావడంతో అదనపు సర్వీసుల పేరుతో అందికాడికి దండుకుంటున్నారు. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ ప్రయాణికులకు సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు.
 
సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆశ్రయిస్తున్న వారు నిండా మునుగుతున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి రూ.1,200 నుంచి రూ.3,500 ఉండే చార్జీలు ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.7 వేల వరకు పలుకుతున్నారు. 
 
అలాగే, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే ఏపీ స్లీపర్ బసుల్లో రూ.4,239 నుంచి రూ.6,239 వరకు వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో సీటర్ ధర గరిష్టంగా రూ.1,849గా ఉండగా, ప్రస్తుతం రూ.5,649 వరకు ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. వోల్వోలాంటి బస్సుల్లో అయితే, ఇది రూ.6,909గా ఉంది. అలాగే విజయవాడకు అయితే, గరిష్టంగా రూ.3,599 వరకు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, ఆర్టీసీ బస్సులోనూ అదనపు ప్రయాణ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణాలోని పలు ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. సాధారణ రోజుల్లో ఏసీ స్లీవర్ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్టంగా రూ.700 ఉండగా, ప్రస్తుతం రూ.1,050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో ఈ ధర రూ.2,310గా ఉంది.