గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (20:15 IST)

జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసైనికుల కోసం బీమా ప్రీమియం చెల్లించారు. తమ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ బీమా పరిమితి రూ.5 లక్షల వరకు ఉంది. ఏదేని ప్రమాదం సంభవించినపుడు వైద్య ఖర్చులకు రూ.50 వేలు వరకు బీమా సదుపాయం కల్పించారు. 
 
ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికిగాను జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు బీమా ప్రీమియంను పవన్ కళ్యాణ్ చెల్లించారు. గురువారం తనను కలిసి బీమా కంపెనీ ఉన్నతాధికారులకో పవన్ చెక్కును అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో బీమా సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకట నరసింహారావు, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ బీమా సదుపాయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకిరానుంది.