శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (15:40 IST)

జేపీ కమిటీని స్వాగతించిన పవన్ కల్యాణ్.. ఆ అంశాలపై లోతుగా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అందరికీ తె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అందరికీ తెలుసునని జేపీ అన్నారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) పైన జనసేన అధినేత పవన్ తొలుత చూపిన శ్రద్ధ ఆ తర్వాత కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. 
 
నిధులపై హడావుడి చేసి ప్రస్తుతం పవన్ కల్యాణ్ సైలెంట్ అయ్యానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర విభజన సమస్యలపై అధ్యయనానికి స్వత్రంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించిన లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ స్పందించారు. 
 
జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.