ఏపీ సీఎం ఎవరు... జగనా? పవనా? మంత్రి బాలినేని ఏమంటున్నారు...
సాధారణంగా సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో తప్పులు జరుగుతుంటాయి. ఇవే తప్పులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా అలాంటి తప్పు దొర్లింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన కార్యక్రమం లైవ్ ఇచ్చే క్రమంలో పొరపాటు జరిగింది. సీఎం లైవ్ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటనకు సంబంధించిన వీడియో లైవ్‌లో ప్రత్యక్షమైంది. కొద్దిసేపు పవన్ కళ్యాణ్ వీడియో అలాగే వచ్చింది.
మంత్రి ఫేస్‌బుక్ పేజ్ కావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. తప్పు ఎక్కడో జరిగినట్లు గమనించి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అప్పటికే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీశారు. విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీడియో రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీకి ముఖ్యమంత్రి జగనా.. పవన్ కళ్యాణా అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి. కొద్దిసేపటికి తప్పును గమనించి వీడియోను తొలగించడంతో వీడియో లేకుండా పోయింది.