గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2025 (15:33 IST)

జగన్ 1.o నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు, ఇంక జగన్2.o చూపిస్తారా?: నారా లోకేష్

Nara Lokesh
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను 2.o చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ చూపించిన 1.o నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు, ఇంక 2.o చూపిస్తారా? ఆయన చూపించిన 1.oనే దారుణంగా వుంటే ఇక ఆ తర్వాతది ఎలా వుంటుంది. వెంట్రుకలు పీకలేరు అంటున్నారు, అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పీకాల్సిన మేరు పీకేసి 11 మాత్రమే వుంచారంటూ సెటైర్లు విసిరారు.
 
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లడుతూ, ఇప్పటి నుంచి జగన్ 2.0 ను చూస్తారంటూ బుధవారం నాడు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల కోసం ఈ జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తాను, జగన్ 1.0లో ప్రజల కోసమే తాపత్రయ పడ్డారు. వారికి మంచి చేసే క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, ఈ కార్యకర్తల కోసం ఈ జగన్ నిలబడతాడు. ఇక నుంచి జగన్ 2.0ను చూస్తారంటూ వ్యాఖ్యానించారు.