ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:08 IST)

మొగుడితో కాపురం చేస్తూ ఎలా చదువుతున్నావ్.. మహిళా ప్రొఫెసర్ వేధింపులు...వైద్య విద్యార్థిని సూసైడ్

మొగుడితో కాపురం చేస్తూ... వైద్య విద్యను ఎలా అభ్యసిస్తున్నావ్ అంటూ సూటిపోటి మాటలతో ఓ మహిళా ప్రొఫెసర్ వేధిండాన్ని తట్టుకోలేని వైద్య విద్యార్థిని ఒకరు బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరులో జరిగిన ఈ వివరాలన

మొగుడితో కాపురం చేస్తూ... వైద్య విద్యను ఎలా అభ్యసిస్తున్నావ్ అంటూ సూటిపోటి మాటలతో ఓ మహిళా ప్రొఫెసర్ వేధిండాన్ని తట్టుకోలేని వైద్య విద్యార్థిని ఒకరు బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన సత్తెయ్య, ప్రమీలా దంపతుల కుమార్తె సంధ్యారాణి (27). మంగళగిరి ఎన్నారై మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. 2015లో పీజీ గైనకాలజీ విభాగంలో జీజీహెచ్‌లో సీటు పొందింది. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత మిర్యాలగూడలో శిశు వైద్య నిపుణుడైన డాక్టర్‌ రవిని పెళ్లి చేసుకుంది. 
 
మరో మూడు నెలల్లో ఆమె కోర్సు పూర్తవుతుంది. ఈలోగా.. ఆదివారం గుంటూరులోని కన్నావారితోట రెండో లైనులోని తాను నివసిస్తున్న ఇంట్లోనే మత్తు ఇంజెక్షన్లను సెలైన ద్వారా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో సంధ్యారాణిని స్నేహితులు జీజీహెచ్‌కు తరలించగా.. పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. 
 
అయితే, చనిపోయే ముందు సంధ్యారాణి సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఇందులో ఓ మహిళా ప్రొఫెసర్‌ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంది. దీంతో ఆ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలంటూ సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.