సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (18:41 IST)

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

Varun Sandesh, Commissioner CV Anand, and Constable team
Varun Sandesh, Commissioner CV Anand, and Constable team
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె.  దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం "కానిస్టేబుల్" . వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి పరిచయం కానున్నారు.
 
 "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్  సాంగ్ ను హైదరాబాద్  పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్  చేతుల మీదగా విడుదల  చేయడం జరిగింది.. దీనికి  శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా  సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. 
 
ఈ సందర్భంగా  పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం.  వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.  ప్రతీ  పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు...
 
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని  అన్నారు.
 
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ  టైటిల్ తో ఈ  సినిమాను నిర్మించడం జరిగింది.  కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి,  నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్  కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల  చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో  దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం. 
 
ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటర్: శ్రీ వర ప్రసాద్, B. G. M : గ్యాని, ఆర్ట్ డైరెక్టర్ : వి. నాని పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం జగ్గయ్య, 
 
సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపెందర్ పవార్. నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.