Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?
సినీ నటి, చెన్నై చంద్రం త్రిష సంచలన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవుతుందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.
కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ సినిమాలకే పరిమితం అయ్యింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలో దళపతి విజయ్ 69 సినిమాతో పాటు, అజిత్ నయా మూవీలోనూ నటిస్తుంది.
ఇకపోతే.. త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ త్రిష నటించిన సంగతి తెలిసిందే.