శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (21:07 IST)

అచ్చెన్నాయుడు ఎత్తుగా పెరిగారే కానీ బుర్ర ఉందో లేదో? ఎవర్ని చెప్పుతో కొట్టాలి?: రోజా (Video)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కులం పేరుతో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారిని చెప్పుకొట్టమన్న మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు నివ్వడంపై ఆమె మండిపడ్డారు. అచ్చ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కులం పేరుతో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారిని చెప్పుకొట్టమన్న మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు నివ్వడంపై ఆమె మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఎత్తు పెరిగారే తప్ప బుర్ర పెరిగిందో లేదో కూడా తెలియట్లేదని రోజా ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలను చూసి అచ్చెన్నాయుడు నిర్ణయించాలని సూచించారు.
 
కాపులకు రిజర్వేషన్ ఇస్తామని కుల రాజకీయం చేసిందెవరో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. తర్వాత కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి, కుల రాజకీయం చేసిందెవరని రోజా నిలదీశారు. అలా కుల రాజకీయాలు చేసిన వారి వద్దకు వెళ్లి చెప్పుతో కొట్టి తాను చెప్పిన వ్యాఖ్యలకు మార్గదర్శకంగా నిలబడాలని సూచించారు. చంద్రబాబు ఆరోజు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన రోజున సామాజిక న్యాయం చేసే వ్యక్తి అని పొగిడిందెవరని నిలదీశారు.