Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పామును ఆడిస్తూ... దాని కాటుతో వ్యక్తి మృతి.. ఎక్కడ?

Written By ఎం
Updated: సోమవారం, 19 జులై 2021 (10:04 IST)
ఓ ఇంటిలో పొంచి ఉన్న పామును పట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించి పాము కాటుకు గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని విజయనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన తేళ్ల కుమారి ఇంటిలో శనివారం ఉదయం గోడలో తాచుపాము కనిపించింది. పామును ఒక్కసారిగా చూసి ఉలిక్కి పడిన ఆమె స్థానికు ల సహాయంతో అదే ప్రాంతం యానాది కాలనీకు చెందిన పాములు ప ట్టే సంజయ్‌(42)కు పామును బయటకు తెచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సంజయ్‌ ఇంటిలో ఉన్న సామాను మొత్తం బయటకు చేర్చాడు. ఈక్రమంలో పాము బండ్ల కిందకు చేరింది. ఎట్టకేలకు సుమారు ఏడు గంటల సమయానికి పామును ప ట్టుకుని బయటకు తెచ్చాడు. ఈక్రమంలో పామును బయటకు తెచ్చి కోరలు తొలగించకుండా ఆడిస్తున్న క్రమంలో పాము కాటుకు గురయ్యా డు.

స్థానికులు వెంటనే అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఈపురుపాలెం పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments