మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:47 IST)

పోలవరంపై మీ వైఖరేమిటి?... కేంద్రానికి గ్రీన్ ట్రైబ్యూనల్ సూటి ప్రశ్న

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ నిలదీసింది. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ కేంద్ర

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ నిలదీసింది. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. 
 
ప్రతియేటా పోలవరం ప్రాజెక్టు పనులపై స్టార్ వర్క్ ఆర్డర్స్ ఎందుకు పొడిగిస్తున్నారని ప్రశ్నించింది. అసలు ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిషా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిషా ససేమిరా అంటోంది. అలాగే, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు తగులుతోంది.