బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (12:01 IST)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

rave party
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకల సంబరాలు అపుడే మొదలయ్యాయి. ఇందులోభాగంగా, పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ బాష్‌ల పేరుతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం చెలరేగింది. ఇందులో ఐదుగురు మహిళలతో 14 మంది పురుషులు ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నిఘా వేసిన పోలీసులు.. సోమవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఇందులో రేవ్ పార్టీలో నిమగ్నమైవున్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నవారంతా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. 
 
ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసింది ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారని పోలీసులు సూచన ప్రాయంగా వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సివుంది. రేవ్ పార్టీని అడ్డుకున్న పోలీసులు.. మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.